AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌లో కలకలం.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా.. కొత్త వేరియెంటేనా.?

Corona: పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీముఖ్యంగా సౌతాఫ్రికాలో...

Corona: బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌లో కలకలం.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా.. కొత్త వేరియెంటేనా.?
Corona Virus
Narender Vaitla
|

Updated on: Nov 27, 2021 | 9:17 PM

Share

Corona: పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీముఖ్యంగా సౌతాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచం థార్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా బెంగళూరు ఎయిర్‌ పోర్టులో వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

సౌతాఫ్రికా నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అధికారులు వీరిని వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. ఒమిక్రాన్‌ వేరియంటేనా అన్న నేపథ్యంలో నిర్థారణకోసం శాంపిల్స్‌ను ముంబయి ల్యాక్‌కు పంపించారు. బెంగళూరులో కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఇదిలా ఉంటే ఈ కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌, డెల్టా కంటే ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇక కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.

Also Read: Manchu Vishnu: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..

చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు !! సో క్యూట్‌ !! వీడియో