ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2021 | 6:18 PM

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద ఇంటర్నెట్‏కు తెగ అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో ఇన్‏స్టాగ్రామ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఇన్‏స్టా ట్రెండ్స్‏కు అట్రాక్ట్ అవుతున్నారు.

ఇన్‏స్టాలో రీల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్‏స్టాలో కొత్త ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. అదే ఐఫోన్ లాక్ స్క్రీన్. ఈ వీడియోను ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కేవలం నార్మల్ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్ వెంట పరుగులు తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీనటులు మాధురీ ధీక్షిత్, గౌమర్ ఖాన్, కరిష్మా తన్నా, సానియా మీర్జా అందరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వీరికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఐఫోన్ లాక్ స్ర్కీన్ .. అంటే.. ఫోన్ కెమెరా ముందు కొన్ని సెకన్ల పాటు కదలకుండా ఉండాలి. వెనక సిగ్నేచర్ ట్యూన్ బన్నా రే సాంగ్ ప్లే అవుతుంది. పాట బీట్ స్టార్ట్ అయినప్పుడు కళ్లను కదిలించాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ లాక్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ లాక్‌స్క్రీన్‌ను తన కారులో ట్రై చేసింది. ఓ ప్రో లాగా బీట్ అయిపోయే వరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయి…ఆ తర్వాత రెప్పలను కదిలించింది. బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కూడా తన కళ్లను నిశ్చలంగా ఉంచి ఆపై కళ్లు కొట్టి కుర్చీలో గిరిగిరా తిరిగింది. దీనికి ‘రియల్ టు రీల్’ అని క్యాప్షన్ తగిలించింది.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

Also Read: Disha Patani: సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Akhanda Pre Release Event live: బాలకృష్ణ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఐకాన్ స్టార్ సందడి..