Manchu Vishnu: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..
Manchu Vishnu: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. మా సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పారు. మా సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్స కోసం తీసుకున్న చర్యలను..
Manchu Vishnu: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. మా సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పారు. మా సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్స కోసం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ.. తనకు ‘మా’ సభ్యుల సంక్షేమమే ముఖ్యమని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వర్కింగ్ ఇన్ ప్రోగ్రస్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించారు. మా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. తాజాగా మా సభ్యుల ఆరోగ్యానికి చికిత్స అందించేలా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయా ఆసుపత్రుల సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు. టెనెట్ డయాగ్నస్టిక్స్ లో 50 శాతం రాయితీతో వైద్య పరీక్షల సదుపాయం అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు.
తాము ఒప్పందం కుదుర్చుకున్న ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఒక్క మా సభ్యుడి పేరుతో ప్రత్యేక హెల్త్ ఫైల్ ఏర్పాటు చేస్తామని.. ఆ ఫైల్ లో సభ్యుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. అంతే కాదు మహిళలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు మంచు విష్ణు. మహిళా సభ్యులు రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సలు కూడా పొందవచ్చని పేర్కొన్నారు. నగరంలోని కిమ్స్, అపోలో, మెడికవర్ అలాగే ఏఐజీ ఆస్పత్రిలో తో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని.. సంగీత (అపోలో), డాక్టర్ సుబ్రమణియమ్ (అపోలో సీఈఓ),డాక్టర్ నాగేశ్వర రెడ్డి (ఏఐజీ), డాక్టర్ గురవారెడ్డి (సన్ షైన్ హాస్పిటల్స్), డాక్టర్ భాస్కర్ రావు (కిమ్స్), డాక్టర్ అనిల్ కృష్ణ (మెడికవర్) లకు మంచు విష్ణు కృతజ్ఞతలను చెప్పారు.
Work in progress. #MAA pic.twitter.com/X3ve9YIbhE
— Vishnu Manchu (@iVishnuManchu) November 27, 2021
Also Read: ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న వర్షాలు.. మొలకలు రావడంతో పశువులకు మేతగా ఉల్లి.. ఎక్కడంటే..