Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,08,954 కరోనా టెస్టులు చేయగా.. 848 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు...
తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,08,954 కరోనా టెస్టులు చేయగా.. 848 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 6గురు బాధితులు కరోనాతో ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,684కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,09,947కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వివరాలు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 44,111 మందికి కొవిడ్ సోకింది. వైరస్ నుంచి 57,477 మంది కోలుకోగా.. 738 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.06 శాతంగా నమోదైంది.
- మొత్తం కేసులు : 3,05,02,362
- మొత్తం మరణాలు : 4,01,050
- కోలుకున్నావారు : 2,96,05,779
- యాక్టివ్ కేసులు : 4,95,533
దేశంలో ఇప్పటివరకు 41,61,27,556 కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం.. 18,76,036 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా శుక్రవారం 43,99,298 డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 34,46,11,291 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: హీరోయిన్ మెహ్రీన్ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి