Sputnik Vaccine: వ్యాక్సినేషన్‌లో ‘స్పుత్నిక్ వీ’ ఊసేదీ..? మార్కెట్లో పెద్దగా కనిపించని రష్యన్ వ్యాక్సిన్..

Sputnik Vaccine India: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇండియాలో స్పుత్నిక్‌ వీ..

Sputnik Vaccine: వ్యాక్సినేషన్‌లో ‘స్పుత్నిక్ వీ’ ఊసేదీ..? మార్కెట్లో పెద్దగా కనిపించని రష్యన్ వ్యాక్సిన్..
Sputnik V
Follow us
Shaik Madar Saheb

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 03, 2021 | 2:11 PM

(Yellender, TV9 Telugu Reporter, Hyderabad)

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇండియాలో అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన మూడవ వాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ. రష్యా వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చి చాలా కాలం అయినప్పటికీ.. ఈ వాక్సిన్ మాత్రం మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. కొన్ని కంపెనీల్లో తప్ప ఎవరూ కూడా వేసుకున్నట్టు దాఖలాలు లేవు. ఈ క్రమంలో.. ఒక్క డోసే 86 శాతంపైగా సమర్ధత ఉందని చెప్పిన రష్యన్‌ వాక్సిన్‌ వినియోగానికి ఎందుకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్‌లో దాదాపుగా నాలుగు వాక్సిన్‌లకు అత్యవసరం కింద వినియోగించుకోవడానికి అనుమతి లభించింది. అందులో కేవలం రెండు వాక్సిన్‌లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 3వ వాక్సిన్‌గా అనుమతి పొందిన స్పుత్నిక్‌-వీ ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో లేకుండా పో యింది. పైగా జులై వరకు 30లక్షల డోసుల వాక్సిన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందని తయారీ అనుమతి పొందిన డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. అయినప్పటికీ కేవలం 3లక్షల డోసుల మాత్రమే రష్యా నుంచి దిగుమతి అయ్యాయి. అయిన అవి కూడా పెద్దగా వినియోగించినట్లు కనిపించటం లేదు.

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ వినియోగానికి ఏప్రిల్‌లోనే డీసీజీఐ అనుమతిచ్చిన్పటికీ కొన్ని కంపెనీల్లో తప్ప ఎవరు కూడా పెద్దగా ఈ వాక్సిన్‌ వేసుకున్నట్లు కనిపించడం లేదు. అంతేకాంకుండా దీనిపై డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు ఎందుకు ఈ కష్టాలొస్తున్నాయంటే.. కేవలం స్టోరేజీ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పుత్నిక్‌-వీ వాక్సిన్‌ను మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర చాలా జాగ్రత్తగా స్టోర్‌ చేయాల్సి రావడమే ఇందుకు కారణమంటున్నారు. దీనికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్‌ పేర్కొంటోంది. కానీ మే నుంచి ఎందుకు ఈ సదుపాయాలు అభివృద్ధి చేసుకోలేదు.. ఇప్పటి వరకు ఇంపోర్ట్‌ చేసిన వాక్సిన్‌ను ఎంత మందికి ఇచ్చారు అనే విషయాలను మాత్రం డాక్టర్‌ రెడ్డీస్‌ ఎప్పుడూ కూడా వెల్లడించలేదు.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సహకారంతో గమలేయా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లో సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకుంది. జులై నుంచి భారత్‌లోనే తయారు చేస్తామని డాక్టర్ రెడ్డీస్‌ చెప్పినా.. దీనికి సంబంధించిన ఊసేలేదు. పైగా కోవిన్‌ యాప్‌లో స్పుత్నిక్‌ వీ చూపిస్తున్నా కూడా అందుబాటులో లేదని పేర్కొంటున్నారు. ఇండియన్‌ మార్కెట్లో స్పుత్నిక్‌వీ ధర.1145 రూపాయలుగా ఉంది. 12.5 కోట్ల మందికి ఈ ఏడాది చివరికల్లా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను అందిస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ చెప్పింది. కానీ ఇప్పటి వరకు లక్ష డోసులు కూడా వాక్సిన్లు వేయని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ వ్యాక్సిన్ ఎప్పటి వరకూ.. సామాన్యులకు అందుబాటులోకి వస్తోందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Also Read..

Etela Rajender: మొన్నటి వరకు భూకబ్జా ఆరోపణలు.. ఇప్పుడు నిధుల దుర్వినియోగం.. మాజీ మంత్రి ఈటలపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు..

Hyderabad: వయసేమో చిన్నది.. కానీ, మహా ముదుర్లు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!