Covid-19 vaccine: రెండు డోసులు తీసుకుంటే.. మృత్యు ప్రమాదం తప్పినట్లే.. అధ్యయనంలో కీలక విషయాలు..
Niti Aayog member VK Paul: దేశంలో కరోనా సెకండ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో
Niti Aayog member VK Paul: దేశంలో కరోనా సెకండ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలో ప్రజలకు పంపిణీ చేస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రజలకు రోగ తీవ్రత, మరణం నుంచి మంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దేశంలో పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్లు మరింత సమర్థవంతమైనవన ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ వెల్లడించారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పంజాబ్ పోలీసులపై జరిపిన అధ్యయనం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఈ రెండు వ్యాక్సిన్లల్లో.. ఒక్క డోసు తీసుకున్న వారికి 92%, రెండు డోసులు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడైందన్నారు.
పంజాబ్ పోలీసుల్లో టీకా తీసుకోని వారు.. ఒక్క డోసు తీసుకున్నవారు.. రెండు డోసులు వేసుకున్నవారిని.. మూడు గ్రూపులుగా విభజించి ఈ అధ్యయనం జరిపినట్లు పేర్కొన్నారు. పంజాబ్ పోలీసుల్లో వ్యాక్సిన్ తీసుకోని వారు 4,868 మంది ఉండగా అందులో కరోనా బారిన పడి 15 మంది మరణించారు. ఒక్క డోసు తీసుకున్న 35,856 మందిలో 9 మంది కొవిడ్‌తో మరణించారు. 42,720 మంది పోలీసులు రెండు డోసులూ తీసుకోగా.. వారిలో ఇద్దరు మాత్రమే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వెల్లడించింది.
ఈ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ తీవ్రత, మరణాలు దాదాపు పూర్తిగా తగ్గిపోతున్నాయని తేలింది. అంతకుముందు.. సీఎంసీ వెల్లూర్‌లో నిర్వహించిన అధ్యయనంలోనూ మన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని వెల్లడైందని వీకే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న తరుణలంలో మన వ్యాక్సిన్లపై అనుమానం అవసరం లేదంటూ ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
Also Read: