Breast Cancer : కరోనా ఎఫెక్ట్..! ఇండియాలో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ బాధితులు.. మహిళలు ఈ విషయాలు తెలుసుకోండి..
Breast Cancer : ఐసిఎంఆర్ 2020 నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్
Breast Cancer : ఐసిఎంఆర్ 2020 నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో 30-40 వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌కి గురవుతున్నారు. అవగాహన లేకపోవడంతో రోగ నిర్ధారణకు ఆలస్యమవుతుంది. ఇది మరణాల రేటుకు కారణమవుతుంది. COVID-19 మహమ్మారి స్క్రీనింగ్ కార్యక్రమాలు, వైద్య సదుపాయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలావరకు రొమ్ము క్యాన్సర్ బాధితులను అభివృద్ధి చెందుతున్న దశలో గుర్తించారు. ఈ పరిస్థితికి కారణం అవగాహన లేకపోవడమే.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ఇలా తెలుసుకోండి.. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. ఈ కారణంగా ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు గనుక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లు గుర్తించాలి. బ్రెస్ట్ నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుంటుంది. ఛాతిపై ఉన్న చర్మ రంగు మారుతుంది. శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మం కలర్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఇది గమనిస్తూ ఉండాలి. నిపుల్స్‌ని నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తుంటే అనుమానించాల్సిందే. కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రాంథుల్లో వాపు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి. రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించిన అనుమానించాలి. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం, రొమ్ములపై గుంటలు, నారింజ పండు రంగులోకి మారితే కచ్చితంగా అనుమానించాల్సిందే.
రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు.. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తరాలు మారే కొద్దీ జన్యువుల్లో మార్పులు వస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పై ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశం 0.6 శాతం మాత్రమే. అదే 70 ఏళ్లు వచ్చేసరికి 3.84 శాతానికి పెరుగుతుంది. రొమ్ములో కొంతమందికి కణుతులు ఉంటాయి. ఇలాంటివారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. వాటిలో క్యాన్సర్ కారక కణితులు లేనప్పటికీ భవిష్యత్‌లో రావొచ్చు. చిన్నవయసులోనే రజస్వల కావడం, ఆలస్యంగా నెలసరులు ఆగిన వారికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే వీరిలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇలాంటివారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏదైనా అనారోగ్యం కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అధికబరువు సమస్యతో బాధపడే వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునేవారికి కూడా ఈ రిస్క్ ఉంటుంది. మిగిలినవారితో పోలిస్తే ఆల్కహాల తీసుకునేవారు ఈ సమస్యతో బాదపడతారు. అదే విధంగా గర్భం దాల్చని వారు 30 ఏళ్ల తర్వాత సంతానం కలిగిన వారికి కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.