Viral Video: మెసేజ్‌‌తో కూడిన ఫన్నీ వీడియో.. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న యువకుడు రైలుకు ఎదురెళ్ళిన వైనం

Surya Kala

Surya Kala |

Updated on: Apr 04, 2021 | 5:20 PM

Viral Video:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణంతకమైన కరోనా మహమ్మారిపై కూడా కొంతమంది కామెడీ చేసేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్..

Viral Video: మెసేజ్‌‌తో కూడిన ఫన్నీ వీడియో.. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న యువకుడు రైలుకు ఎదురెళ్ళిన వైనం
2nd Of Corona Vaccine

Shocking viral video: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణంతకమైన కరోనా మహమ్మారిపై కూడా కొంతమంది కామెడీ చేసేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వైరస్‌ సోకినా నో ప్రాబ్లం అనే కాన్ఫిడెన్స్‌ ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ప్రస్తుత వీడియోలో ఓ కుర్రాడు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే… ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఎంతలా పెరుగుతుందో ఫన్నీగా చూపించాడు. ఆ వీడియో ప్రకారం పట్టాలపై స్పీడ్‌గా వస్తున్న రైలుకు ఎదురెళ్లిన యువకుడు ధైర్యంగా నిలబడతాడు. అయితే వీడియో చూసేవారు ఆ ట్రైన్‌ దగ్గరికి వచ్చాక.. ఆ యువకుడు పక్కకు వెళ్లిపోతాడని అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఆ కుర్రాడు ట్రైన్‌ దగ్గరికి వచ్చినా కూడా పట్టాలపైనే ఉంటాడు. అంతే కాకుండా ఆ రైలును కాలితో బలంగా తన్నాడు. అంతే… రైలు ఎలా వచ్చిందో అలాగే వెనక్కి పరుగులు తీసింది.

అయితే, ఇది కంప్లీట్‌గా గా గ్రాఫిక్ వీడియో. కానీ వీడియో చూసేవాళ్లకు మాత్రం ఇది నిజమైన వీడియోలానే అనిపిస్తుంది. రైలును తన్నిన తర్వాత ఆ యువకుడు అదే పట్టాలపై నడుస్తూ… వెనక్కి వెళ్లిపోతున్న రైలును చూసి… ఇదీ రెండు వ్యాక్సిన్లు తీసుకుంటే వచ్చే కాన్ఫిడెంట్‌ అన్నట్లుగా చూడటం.. అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఈ వీడియోని నెట్టింట్లో షేర్ చేస్తూ.. ఫన్నీ కాప్షన్ జోడించారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటే… ఇక కరోనా ఎందుకు సోకుతుంది అని అడిగారు. ఐతే… ఈ కామెంట్ వెనుక ఓ సెటైర్ కూడా దాగి ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఇక కరోనా రాదనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటున్నారనే విమర్శ ఉంది. అలాంటి వారి వల్ల కరోనా కేసులు పెరిగే ఛాన్స్‌ ఉందనేది హర్ష గోయెంకా ఉద్దేశంగా చెప్పుకోవచ్చు.

Also Read: వేసవి దాహార్తిని తీర్చే రాయలసీమ స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్..విశిష్టత ఏమిటంటే..!

భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu