AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid19 Vaccine: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్..

Covid19 Vaccine: ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా పని చేస్తున్న వారిగా జర్నలిస్టులను..

Covid19 Vaccine: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్..
Covid19 Vaccine
Shiva Prajapati
|

Updated on: Apr 04, 2021 | 3:33 PM

Share

Covid19 Vaccine: ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా పని చేస్తున్న వారిగా జర్నలిస్టులను కూడా గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జర్నలిస్టులందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ‘కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న జర్నలిస్టులకు అండగా ఉంటాం. జర్నలిస్టులందరికీ వయసుతో సంబంధం లేకుండా కోవిడ్ టీకా ఇస్తాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ పేరిట విడుదల చేసిన అధికారిక ప్రకనటలో పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి గతేడాది మనదేశంలో ప్రవేశించిన తరువాత వేగంగా వ్యాప్తి చెందింది. దాంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే జర్నలిస్టులు మాత్రం నిరంతరం విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేస్తూ, వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల సేవలను గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారిని ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ టీకా ఇస్తుండగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా వేయాలని డిసైడ్ అయ్యింది.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో సీఎం రావత్.. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కోవిడ్ టెస్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. టెస్టుల సామర్థ్యం పెంచడంతో పాటు.. రోగులకు సరైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకూ టీకా సదుపాయాలు తీసుకెళ్లాలని అధికారులను రావత్ ఆదేశించారు. ఉత్తరాఖండ్ 100 శాతం టీకా వేసిన రాష్ట్రంగా అవతరలించాలి అధికారులకు సీఎం రావత్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Also read:

Karthika Deepam: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా..

One Week Paid Holidays: ఉద్యోగులకు బంపరాఫర్.. వారం పాటు జీతంతో కూడిన సెలవులు.. ఏ కంపెనీ ఇస్తుందో తెలుసా.?