AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Week Paid Holidays: ఉద్యోగులకు బంపరాఫర్.. వారం పాటు జీతంతో కూడిన సెలవులు.. ఏ కంపెనీ ఇస్తుందో తెలుసా.?

One Week Paid Holidays: ఏ ఉద్యోగులైనా తమ సంస్థ అభివృద్ధి కోసమే పనిచేస్తుంటారు. కొన్నిసార్లు ఓవర్‌ డ్యూటీ చేసైనా సంస్థకు లాభాలు చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల పనితీరును గుర్తించే..

One Week Paid Holidays: ఉద్యోగులకు బంపరాఫర్.. వారం పాటు జీతంతో కూడిన సెలవులు.. ఏ కంపెనీ ఇస్తుందో తెలుసా.?
Holidays
Narender Vaitla
|

Updated on: Apr 04, 2021 | 3:21 PM

Share

One Week Paid Holidays: ఏ ఉద్యోగులైనా తమ సంస్థ అభివృద్ధి కోసమే పనిచేస్తుంటారు. కొన్నిసార్లు ఓవర్‌ డ్యూటీ చేసైనా సంస్థకు లాభాలు చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల పనితీరును గుర్తించే సంస్థలు వారికి పలు రకాల ఇంక్రిమెంట్‌లు ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. అయితే తాజాగా ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ సంస్థ అయిన లింక్డ్‌ఇన్‌ తమ ఉద్యోగుల కోసం ఓ బంపరాఫర్ ప్రకటించింది.

Linkedin

Linkedin

తమ సంస్థలో ఫుల్‌ టైం ఉద్యోగులకు ఏకంగా వారం రోజుల పాటు జీతంతో కూడిన సెలవులు (పెయిడ్‌ లీవ్‌) ఇస్తున్నట్లు ప్రకటించింది. కష్టపడి తమ కంపెనీకోసం పని చేసిన ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించి, కావాల్సినంతా విశ్రాంతి తీసుకొని తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పనిచేందుకే ఈ సెలువులు ఇచ్చినట్లు ప్రకటించింది. వచ్చే సోమవారం అంటే ఏప్రిల్‌ 5 నుంచి ఈ సెలవులు అందుబాటులోకి రానున్నాయి. ‘రెస్టప్‌’ పేరుతో లింక్ట్‌ఇన్‌ ఈ సెలవులను అందిస్తోంది. ఈ విషయమై సంస్థ కీలక ఉద్యోగి అయిన తుయిలా హాన్సన్‌ మాట్లాడుతూ.. సంస్థ కోసం కష్టపడి పనిచేసిన తమ ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నాం. సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులందరూ పూర్తి శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఉద్యోగులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మీక్కూడా ఇలాంటి ఆప్షన్‌ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా కదూ..!

Also Read: Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Long life Battery: ఒక్కసారి మొబైల్‌ ఛార్జింగ్‌ చేస్తే 9 ఏళ్లపాటు నిరంతరాయంగా నడుస్తుంది.. త్వరలోనే కొత్త బ్యాటరీలు..

Suez Canal Ship: సూయజ్ కాలువలో ఇరుక్కున్న భారీ నౌక కదిలేందుకు ‘చంద్రుడు’ సాయం చేశాడు.. అదెలాగంటే..