Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Indian Air Force Recruitment 2021: భారత వైమానిక దళంలో 1,524 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్..

Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
Indian Air Force
Follow us

|

Updated on: Apr 04, 2021 | 3:04 PM

Indian Air Force Recruitment 2021: భారత వైమానిక దళంలో 1,524 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్‌డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు పోస్టలు ఈ నోటిపికేషన్‌లో ఉన్నాయి. ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకువోచ్చునని తెలిపింది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ అఫిషియల్ వెబ్‌సైట్ indianairforce.nic.in లో సంబంధిత పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 2 గా నిర్ణయించారు.

అభ్యర్థుల అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలని నిర్ణయించారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లీష్ మాద్యమాల్లో వస్తుంది. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. జాబ్ జాయిన్ అయ్యే టైమ్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్లు అధికారులకు చూపించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు: పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకుని ఉండాలి. కోవిడ్ 19 నెగిటీవ్ ధృవీకరణ పత్రంతో వస్తేనే పరీక్ష హాల్‌లోకి అనుమతించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Also read:

టీనేజ్‌ అమ్మాయిలా నలభై ఏళ్ల హీరోయిన్..!1995 లో సినీ ఎంట్రీ..ఇప్పటికి తగ్గని క్రేజ్.:Manju Warrier’s pics goes viral Video.

Color Changing Shiva Linga: అమావాస్యకు బూడిద రంగులో..పౌర్ణమికి గంధం రంగులో దర్శనమిచ్చే శివుడు..

Long life Battery: ఒక్కసారి మొబైల్‌ ఛార్జింగ్‌ చేస్తే 9 ఏళ్లపాటు నిరంతరాయంగా నడుస్తుంది.. త్వరలోనే కొత్త బ్యాటరీలు..