- Telugu News Photo Gallery Technology photos American ndb startup company making long life battery which give 28 thousend years life and mobile version give 9 years
Long life Battery: ఒక్కసారి మొబైల్ ఛార్జింగ్ చేస్తే 9 ఏళ్లపాటు నిరంతరాయంగా నడుస్తుంది.. త్వరలోనే కొత్త బ్యాటరీలు..
Long life Battery: మనం ఒక్క రోజు ఫుల్ ఛార్జింగ్ వస్తేనే ఫోన్ బాగుంది అంటూ మురిసిపోతాం. అలాంటిది ఏకంగా 9 ఏళ్లు నిరంతరాయంగా బ్యాటరీ నడిస్తే.. ఊహించుకోడానికే వింతగా ఉన్నా ఇది త్వరలోనే సాకారం కానుంది.
Updated on: Apr 04, 2021 | 2:48 PM

స్మార్ట్ ఫోన్‌లకు ప్రధాన శత్రువు బ్యాటరీ. ఎన్ని ఫీచర్లతో ఉన్న ఫోన్ అయినా సరే వాటిలో ఉండే ప్రధాన సమస్య బ్యాటరీ ఎక్కువ కాలం రాకపోవడమే.

ఒక్క రోజు ఫుల్ టైమ్ ఛార్జింగ్ వస్తేనే మనం ఫుల్ ఖుషీ అవుతుంటాము. మరి అలాంటిది 9 ఏళ్లపాటు నిరంతరాయంగా లైఫ్ ఇచ్చే బ్యాటరీ ఉంటే.. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ త్వరలోనే ఇది సాకారం కానుంది.

అమెరికాకు చెందిన ఎన్‌డీబీ అనే స్టార్టప్ సంస్థ ఈ దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఓ కొలిక్కి కూడా వచ్చాయి. 2023లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

వజ్రాలు, అణు వ్యర్థాలతో తయారు చేస్తోన్న ఈ బ్యాటరీలను అంతరిక్ష పరిశోధనల కోసం అభివృద్ధి చేస్తోంది. ఇవి ఛార్జింగ్ అవసరం లేకుండా 28వేల ఏళ్లు పనిచేస్తోంది.

ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల కోసం బ్యాటరీని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కోసం తయారుచేయనున్నారు. ఇది సాకారం అయితే మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేయకుండా 9 ఏళ్లు వాడుకోవచ్చు.

ఎన్‌డీఏ బ్యాటరీలో వజ్రాలు, అణు వ్యర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి. అణువ్యర్థాల నుంచి వెలువడే రేడియో ధార్మికతను, ఉష్ణాన్ని వజ్రాలు తీసుకొని మరో పొరకు పంపిస్తాయి. ఇలా పొరల మధ్య రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

సాధారణంగా అణువ్యర్థాలు వేల సంవత్సరాలపాటు తమ నుంచి రేడియో ధార్మికతను విడుదల చేస్తాయి. అందువల్లనే ఈ బ్యాటరీలు వేల సంవత్సరాలు పనిచేస్తాయి.




