Nannari Sarbath: వేసవి దాహార్తిని తీర్చే రాయలసీమ స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్..విశిష్టత ఏమిటంటే..!
nannari sharbat: వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా కూల్ డ్రింక్స్ ను ఆశ్రయించడం కంటే.. సహజమైన డ్రింక్స్ తయారీ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇక వేసవి డ్రింక్ లో ఒకటి ‘నన్నారి షర్బత్’..
Nannari Sarbath: వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా కూల్ డ్రింక్స్ ను ఆశ్రయించడం కంటే.. సహజమైన డ్రింక్స్ తయారీ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇక వేసవి డ్రింక్ లో ఒకటి ‘నన్నారి షర్బత్’ . దీనినే కొన్ని చోట్ల సుగంధి షోడా అంటారు. దీనిలో శబ్జా గింజలు నాన పెట్టి కలిపి తాగితే.. శరీరం చల్లబడుతుంది. ఇక నన్నారి షర్బత్ కు 40 ఏళ్ళపైనే చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ డ్రింక్ పేరు చెప్తే కడప జిల్లా గుర్తుకొస్తుంది కొందరికి. ఎందుకంటే వేసవిలో నన్నారి షర్బత్ అనే పేరు రాయలసీమ అంతటా మారుమ్రోగుతుంది. ఎంత ఎండలో తిరిగొచ్చినా నన్నారి గొంతులో పడితే హాయి. నన్నారి లేని సోడా బంకు, కూల్ డ్రింక్స్ షాపు ఉండదక్కడ. రాయలసీమలోనే దొరికే ఒక విశిష్టమయిన వేరు నుంచి తయారయ్యే డ్రింక్.
రాయలసీమలో ఎక్కువగా పెరిగే వనమూలికల చెట్లలో సుగంధిపాల చెట్టు ఒకటి. ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో పెరిగి భూమిలోకి వెళతాయి.ఈ వేర్లు ఆరోగ్యానికి చాలా మంచివని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పండ్లు,చెట్టు వేర్లు కూడా ఉపయోగపడతాయి.అలా ఉపయోగపడే వేర్లున్న చెట్టు ‘సుగంధపాల’. సుగంధిపాల చెట్లు వేర్లని కట్ చేసి, ఎండలోపెట్టి, వీటిని నీళ్ళలో మరిగించి పంచదారకలిపి ఒక సిరప్ ని తయారు చేస్తారు.ఇలా చేసిన సిరప్ ని ‘నన్నారి’ అంటారు.
ఒక గ్లాసులో కొద్దిగా నన్నారిని పోసి.. అందులో ఒక నిమ్మకాయను పిండి, చల్లటి సోడాను కొట్టి గ్లాసులో పోసి ఇస్తారు. దీనినే నన్నారి షర్బత్ అంటారు. రాయలసీమ జిల్లాల్లో వేసవికాలం వేడికి, చల్లటి నన్నారి షర్బత్ మంచి ఔషధం లా పనిచేస్తుంది. ఒకప్పుడు కడపజిల్లాలో మాత్రమే దొరికే ఈ నన్నారి సిరప్ ఇప్పుడు మిగిలిన జిల్లాలకి విస్తరించింది. అన్నిచోట్లా దొరుకుతోంది ఈ నన్నారి షర్బత్. అయితే నన్నారు షర్బత్ తాగాలి అంటే రాయలసీమ లోనే తాగాలి అన్నంత పేరు గాంచింది. ఒకసారి తాగితే వదిలిపెట్టరు స్థానికులు.
Also Read: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా..
అమావాస్యకు బూడిద రంగులో..పౌర్ణమికి గంధం రంగులో దర్శనమిచ్చే శివుడు..