Ostrich Bird Egg Food: ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!

Ostrich Bird Egg Food: తెలుగులో ఉష్ట్రపక్షి లేక నిప్పుకోడి అని అంటాం. అయితే ఈ పక్షి ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రిచ్ గా ప్రసిద్ధి. ఆఫ్రికా ఖండం దీని నివాసం.. ముఖ్యంగా ఈ పక్షి 'ఔడ్‌షూర్న్' పట్టణంలో కనిపిస్తుంది..

Ostrich Bird Egg Food: ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు..  ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!
Ostrich Bird Egg
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2021 | 12:36 PM

Ostrich Bird Egg Food: తెలుగులో ఉష్ట్రపక్షి లేక నిప్పుకోడి అని అంటాం. అయితే ఈ పక్షి ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రిచ్ గా ప్రసిద్ధి. ఆఫ్రికా ఖండం దీని నివాసం.. ముఖ్యంగా ఈ పక్షి ‘ఔడ్‌షూర్న్’ పట్టణంలో కనిపిస్తుంది. అందుకనే ఈ పట్టణం ‘ప్రపంచ ఆస్ట్రిచ్ రాజధాని’గా ప్రసిద్ధి గాంచింది. ఉష్ట్రపక్షి ఎగరలేని పక్షి జాతులలో అతి పెద్దది. ఉష్ట్రపక్షి పొడవైన కాళ్ళు, మెడ భారీ ఆకారం కలిగిఉండడం ఈ పక్షి ప్రత్యేకత. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న పక్షులు పెట్టే గుడ్లలో ఉష్ట్రపక్షి గుడ్డే అతి పెద్దది.

ఈ పక్షి మిడుతలు, బల్లులు, పాములు మరియు ఎలుకలనును ఆహారంగా తీసుకుంటుంది. అయితే ఎక్కువగా విత్తనాలు, ఆకులు వంటి వృక్ష సంపాదనే తినడానికి ఇష్టపడుతుంది. ఇక తాను పీచు అధికంగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం అరగడం కోసం ఇసుకలో తలపెట్టి ఇసుక , గులకరాళ్లు తిని ఆ ఆహారాన్ని అరిగించుకుంటుంది. ఇక ఉష్ట్రపక్షులు 5 నుంచి 50 వరకు గుంపులుగా జీవిస్తాయి. శత్రువులు తరిమితే అవి సాధారణంగా పారిపోతాయి. కానీ ఒక్కొక్కసారి నేలపై అడ్డంగా పడుకుంటాయి. శత్రువు మరీ సమీపిస్తే అవి తమ బలమైన కాళ్లతో తన్ని గాయపరుస్తాయి. ఈ ఉష్ట్రపక్షుల ఆకర్షణీయమైన పెద్ద ఈకలకూ, చర్మం కలిగి ఉంది. దీంతో దీని చర్మం కొన్ని ఉత్పాదనల్లో వినియోగిస్తారు. ఇక ఉష్ట్రపక్షి మాంసానికి మార్కెట్ విలువ బాగా ఉంది.

ఇక భారీగా ఉండే ఆ స్ట్రిచ్ గుడ్డు కూడా భారీగా ఉంటుంది. దీనిని పగలగొట్టాలంటే కూడా చాలా కష్టం. ఒక్క గుడ్డుతో చేసిన వంటకాన్ని దాదాపు 15 మంది వరకు తినొచ్చట. ఇక ఈ పక్షి గుడ్డు 2 కిలోల బరువు ఉంటుంది. ఉడికించాలంటే కూడా దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇందులో కోడి గుడ్డు కంటే ఎక్కువ స్థాయిలో కాల్షియం, ఇనుము మరియు విటమిన్ ఎ కలిగి ఉంటాయి. కొవ్వు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది అత్యంత బలవర్థకమైన, పుష్టికరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు.

సారా రైనీ అనే మహిళ ఈ గుడ్డుతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ భోజన ప్రియులను అలరిస్తున్నారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్లో ఉదయం అల్పాహారంగా ఈ గుడ్డుతో చేసిన వంటలను ఉంచుతారట. ఉష్ట్రపక్షి గుడ్లలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్, మాంగనీస్ మరియు సెలీనియం ఉంటాయి. ఎ లైఫ్ ఆఫ్ హెరిటేజ్ ప్రకారం , ఒక ఉష్ట్రపక్షి గుడ్డు కోడి గుడ్డు కంటే కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ గుడ్డులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అవసరమైన అమైనో ఆమ్లాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఇంకా ఈ గుడ్డులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైనవి. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. కంటి చూపుకు ఉపయోగపడతాయి.

ఒక ఉష్ట్రపక్షి గుడ్డులో సుమారు 2000 కేలరీలు, 100 గ్రా కొవ్వు మరియు 235 గ్రా ప్రోటీన్లు ఉన్నాయి. భారీ సైజులో ఉండే ఉష్టపక్షి గుడ్డు 28 పెద్ద కోడి గుడ్లను కలిపితే ఎంత ఉంటుందో ఈ పక్షి గుడ్డు అంత ఉంటుంది. ఒక కోడి గుడ్డులోని కొలెస్ట్రాల్ కంటెంట్‌తో పోల్చినప్పుడు ఉష్ట్రపక్షి గుడ్డులో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది.

Also Read: టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన అల్లు అరవింద్.. త్రివిక్రమ్ కూడా కరోనా అంటూ టాక్..!

డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!