AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanya Utthan Yojana 2021: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Kanya Utthan Yojana 2021:ఒక ఇంట్లో తండ్రి విద్యావంతుడైతే.. అతనికి మాత్రమే పరిమితం.. అదే తల్లి విద్యావంతురాలైతే.. కుటుంబం మొత్తానికి ప్రయోజనం. అందుకనే కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికలకు..

Kanya Utthan Yojana 2021: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!
Kanya Utthan Yojana
Surya Kala
|

Updated on: Apr 04, 2021 | 11:18 AM

Share

Kanya Utthan Yojana 2021:ఒక ఇంట్లో తండ్రి విద్యావంతుడైతే.. అతనికి మాత్రమే పరిమితం.. అదే తల్లి విద్యావంతురాలైతే.. కుటుంబం మొత్తానికి ప్రయోజనం. అందుకనే కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికలకు విద్యనందించడం కోసం ఎంతో కృషి చేస్తుంది. ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కొన్ని పథకాల ద్వారా విద్యార్థినులకు పుస్తకాలు, సైకిల్, స్కూల్, యూనిఫామ్స్, స్కాలర్ షిప్స్ వంటివి పోత్సాహకాలను అందిస్తుంది. ఇక ప్రధాని మోడీ బేటీ బచావో.. బేటీ పడావో నినాదంతో,, సుకన్య సమృద్ధి యోజన స్కిం ను ప్రవేశ పెట్టింది. ఈ పథకాని లక్షలాదిమంది మంది తల్లిదండ్రులు ఉపయోగించుకుంటూ.. తమ కూతుళ్ళకు మెరుగైన భవిష్యత్ ను అందించేలా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాలు కూడా విద్యను ప్రోత్సహించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ.. స్కాలర్ షిప్స్ ను ప్రవేశ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక విద్యలో బీహార్ ప్రభుత్వం కూడా అనేక పథకాలు ప్రారంభించింది.

ఇందులో ‘ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన’ ఒకటి. ఈ పథకంలో 10, 12, గ్రాడ్యుయేషన్ పాసైన విద్యార్థినులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు రూ.25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థినులకు రూ.50 వేల ప్రోత్సాహకం ఇస్తున్నామని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో ఇంటర్ పాసైతే రూ.10 వేలు, డిగ్రీ పాసైతే రూ.25 వేలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నితీష్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచింది. దీని కోసం అదనపు బడ్జెట్‌ను కూడా కేటాయించింది.

ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్, డిగ్రీ విద్యార్థినులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఈ పథకంలోకి చేరాలనుకునే వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, దీని కోసం బీహార్ ప్రభుత్వం ఈ-కళ్యాణ్ పోర్టల్‌ని కూడా ప్రారంభించింది

ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలనుకునే విద్యార్థినులు ముందుగా ఈ-కళ్యాణ్ పోర్టర్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజనా పథకాన్ని క్లిక్ చేయాలి. ఇందులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇంటర్/డిగ్రీకి సంబంధించిన మార్కులు నింపాలి. పూర్తి సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, మార్క్‌షీట్, ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్, ఫోటో తప్పనిసరిగా జతచేయాలి.

Also Read: శాస్త్రీయ పద్ధతిలో ఎకరం భూమిలో టమాటా పంట సాగు.. నీటి ఆదాతో పాటు.. లక్షలు ఆర్జిస్తున్న రైతు.. ఎక్కడంటే..!

డిజిటల్ లో రిలీజ్ కానున్న అందమైన ప్రేమ కథ.. ఉప్పెన.. విడుదల తేదీ ఎప్పుడంటే..!