AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases Updates: దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్.. తాజాగా ఎన్ని కేసులు నమోదుయ్యాయంటే..

India Corona Cases Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో..

India Corona Cases Updates: దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్.. తాజాగా ఎన్ని కేసులు నమోదుయ్యాయంటే..
India Corona Cases
Shiva Prajapati
|

Updated on: Apr 04, 2021 | 11:30 AM

Share

India Corona Cases Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ ఇప్పటికే మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 93,249 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. ఇక కరోనా కారణంగా 513 మంది చనిపోగా.. 60,048 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజా రివకరీలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 1,16,29,289 లకు చేరింది. ఇక తాజాగా నమోదైన మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,64,623 మంది కరోనా తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,91,597 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 27.38 లక్షల మందికి కరోనా టీకా వేయగా.. ఇప్పటి వరకు టీకా పొందిన వారి సంఖ్య 7,59,79,651 కి చేరింది.

ఇదిలాఉండగా.. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయినట్టు కనిపిస్తోంది. ఆ ప్రాంతాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 81.42 శాతం కేసులు నమోదయ్యాయి. పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ జిల్లాలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఈ పది జిల్లాల్లోనే రోజువారీ కేసుల్లో 50 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి.

Also read:

Kanya Utthan Yojana 2021: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!

సినిమాను సీన్ తలపిస్తున్న అద్భుతం సంఘటన… అవయవదానం చేస్తుండగా!:Brain Dead Man Comes video.

Constable’s house set on fire : ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. కిటికీలోనుంచి పెట్రోల్ పోసి ఘాతుకం