Facebook: ఫ్రీగా 500 మిలియన్ ఫేస్ బుక్ యూజర్ల వివరాలు కావాలా నాయనా.. లీకర్ ఓపెన్ ఆఫర్!
తన వద్ద 500 మిలియన్ ఫేస్ బుక్ యూజర్ల వివరాలు ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయనీ.. ఎవరికైనా కావాలంటే ఫ్రీగా అన్ని వివరాలు అందిస్తానని ఒక ఫేస్ బుక్ లీకర్ ప్రకటించడం కలకలం సృష్టించింది.
Facebook: తన వద్ద 500 మిలియన్ ఫేస్ బుక్ యూజర్ల వివరాలు ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయనీ.. ఎవరికైనా కావాలంటే ఫ్రీగా అన్ని వివరాలు అందిస్తానని ఒక ఫేస్ బుక్ లీకర్ ప్రకటించడం కలకలం సృష్టించింది.
అయితే, ఈ వివరాలు జనవరి నుంచి హ్యాకర్ల సర్కిల్స్ లో ఉన్నవేనని తెలుస్తోంది. మదర్ బోర్డు టెక్ పబ్లికేషన్ మొదటగా జనవరిలో ఈ హ్యాకింగ్ గురించి చెప్పినట్లు ఇజ్రాయిల్ సైబర్ క్రైమ్ ఇంటిలిజెన్స్ సంస్థ హుద్ సన్ రాక్ కో ఫౌండర్ అలాన్ గాల్ వెల్లడించారు.
ఈ విషయాన్ని రాయిటర్స్ వెంటనే బయట పెట్టలేదు. ఈ లీకేజీ వ్యవహారం తక్కువ స్థాయికల హ్యాకర్లు తమ డిజిటల్ ఐడెంటిటీ కోసం చేసిందని రాయిటర్స్ భావించింది. అయితే, అలాన్ గాల్ తన పరిశోధనలో కొంతమంది ఫోన్ నెంబర్లు లీక్ అయిన ఫోన్ నెంబర్లతో సరిపోతున్నాయని తెలిసిందని శనివారం ప్రకటించారు. కొంతమంది జర్నలిస్టులు కూడా కొన్ని ఫోన్ నెంబర్లు తెలిసినవారి ఫోన్ నెంబర్లతో సరిపోతున్నాయని వెల్లడించారు.
అయితే, ఫేస్ బుక్ మాత్రం ఇది చాలా పాత డాటా అని దానిని 2019 ఆగస్టులోనే ఫిక్స్ చేశామని చెబుతోంది.
సమాచారాన్ని లీక్ చేస్తా అని చెప్పిన వారిని కాంటాక్ట్ చేయడం కోసం రీయూటర్స్ చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై హుద్ సన్ రాక్ కో ఫౌండర్ అలాన్ గాల్ సోషల్ ఇంజనీరింగ్ దాడుల పై ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెబుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ఫోన్ నెంబర్లు.. డేటా పొందిన వ్యక్తులు సోషల్ ఇంజనీరింగ్ దాడులకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.