AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan : సిక్సర్ల సునామీ..ఒకే ఓవర్‌లో 28 పరుగులు..రోహిత్ రికార్డు సమం చేసిన ఇషాన్

Ishan Kishan : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా కుర్రాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Ishan Kishan : సిక్సర్ల సునామీ..ఒకే ఓవర్‌లో 28 పరుగులు..రోహిత్ రికార్డు సమం చేసిన ఇషాన్
Ishan Kishan
Rakesh
|

Updated on: Feb 13, 2026 | 12:41 PM

Share

Ishan Kishan : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా కుర్రాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న ఇషాన్, ఓవరాల్‌గా 24 బంతుల్లో 61 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏదైనా ఉందంటే అది పవర్‌ప్లే చివరి ఓవరే. నమీబియా బౌలర్ జేజే స్మిత్ వేసిన ఆ ఓవర్‌లో ఇషాన్ కిషన్ పూనకం వచ్చినట్లు ఆడాడు. మొదటి బంతి డాట్ అయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి మొత్తం ఆ ఓవర్‌లో 28 పరుగులు పిండుకున్నాడు. దీనితో టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ (2024 వరల్డ్ కప్) రికార్డును ఇషాన్ సమం చేశాడు. ఈ జాబితాలో 36 పరుగులతో యువరాజ్ సింగ్ (2007) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో 250 పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న అతను, మొత్తం ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. ఓపెనర్‌గా వచ్చి పవర్‌ప్లేలోనే జట్టు స్కోరును వందకు చేరువ చేయడం వల్ల భారత్‌కు తిరుగులేని ఆధిపత్యం లభించింది. పవర్‌ప్లేను ఎలా వాడుకోవాలో ఇషాన్ తన ఇన్నింగ్స్ ద్వారా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.

నిజానికి ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. క్రమశిక్షణ చర్యలు, ఫామ్ లేమి వంటి కారణాలతో సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి మళ్లీ నేషనల్ టీంలోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ బాది ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్, ఇప్పుడు వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో సత్తా చాటడం విశేషం. టీమిండియా టాప్ ఆర్డర్‌లో ఇలాంటి అగ్రెసివ్ బ్యాటర్ ఉండటం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది.

సూపర్ 8 దిశగా సాగుతున్న భారత్‌కు ఇషాన్ ఫామ్ చాలా ముఖ్యం. నమీబియా వంటి చిన్న జట్లపైనే కాకుండా పెద్ద జట్లపై కూడా ఇలాగే ఆడితే భారత్ రెండోసారి టీ20 కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ఇండియా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ లాంటి ఆటగాళ్లు క్లిక్ అయితే ప్రత్యర్థి ఎవరైనా సరే వణకాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..