గుడ్డు పచ్చసొన తింటే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా?

13 February 2026

TV9 Telugu

TV9 Telugu

ప్రోటీన్స్, ఆరోగ్యకర‌మైన కొవ్వులు, విట‌మిన్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు పుష్కలంగా ఉండే గుడ్డు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది

TV9 Telugu

అయితే గుడ్డు మొత్తం తీసుకోవ‌డం వ‌ల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుందని చాలా మంది గుడ్డు తెల్లసొన‌ను మాత్రమే తింటుంటారు

TV9 Telugu

కొలెస్ట్రాల్ గురించి త‌ప్పుడు అభిప్రాయాన్ని క‌లిగి ఉండ‌డం వ‌ల్ల చాలా మంది గుడ్డు ప‌చ్చసొన‌ తినడం లేదని నిపుణులు అంటున్నారు. మ‌న శ‌రీరంలో క‌ణ నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి, మెద‌డు ప‌నితీరుకు, రోగ‌నిరోధ‌క వ్యవ‌స్థకు కొలెస్ట్రాల్ చాలా అవ‌స‌రం

TV9 Telugu

దాదాపు 85 శాతం కొలెస్ట్రాల్ మ‌న శ‌రీరంలో ఉండే కాలేయ‌మే త‌యారు చేస్తుంది. కొలెస్ట్రాల్ లో కూడా త‌క్కువ సాంద్రత క‌లిగిన లిపోప్రోటీన్ (ఎల్‌డిఎల్), అధిక సాంద్రత క‌లిగిన లిపో ప్రోటీన్( హెచ్‌డిఎల్) అని రెండు ర‌కాలు ఉంటాయి

TV9 Telugu

ఎల్‌డిఎల్ అధిక స్థాయిల‌ ఉండ‌డం వ‌ల్ల ధ‌మ‌నుల‌లో అడ్డంకులు ఏర్పడి గుండె జ‌బ్బుల ప్రమాదం పెరుగుతుంది. క‌నుక దీనిని చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డిఎల్) అంటారు

TV9 Telugu

హెచ్‌డిఎల్‌ని మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. ఇది ధ‌మ‌నుల్లో ఉండే కొలెస్ట్రాల్ ను కాలేయానికి తీసుకెళ్లి శ‌రీరం బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెర‌గ‌డానికి గుడ్డు ప‌చ్చసొన కార‌ణం కాదు 

TV9 Telugu

అధిక సంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ధూమ‌పానం వంటి కార‌ణాల వ‌ల్లే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు 

TV9 Telugu

గుడ్డు ప‌చ్చసొన‌ పూర్తిగా మానేయ‌కుండా దీనిని మితంగా తీసుకుంటూనే స‌మ‌తుల్య ఆహారాన్ని తీసుకోవ‌డం, శారీర‌క శ్రమ ఉండేలా చూసుకోవ‌డం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌డం, ధూమ‌పానం మానేయ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు