రోజుకో వెల్లుల్లి రెబ్బ పచ్చిగా తిన్నారంటే..

13 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఎన్నో వ్యాధులకు ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం వెల్లుల్లి. వెల్లుల్లిలోని ఎలిసిన్‌ అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతల నుంచి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వరకు ఎన్నో వ్యాధులకు ఛూమంత్రం

TV9 Telugu

ఇందులోని సెలీనియం క్యాన్సర్‌ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, వృద్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు

TV9 Telugu

వెల్లుల్లికి ఉన్న ఈ  సహజ రోగ నిరోధక లక్షణాలు పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్, ఐరన్ ధాతువులు రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధులతో పోరాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బందిపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు

TV9 Telugu

కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే పదార్థమే. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు

TV9 Telugu

వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట

TV9 Telugu

వీటితో పాటు వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి

TV9 Telugu

గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో రోజూ తీసుకోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు