కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: వీడియో కాల్‌తో పెళ్లి చేసుకున్న యువ జంట

ప్రతీఏటా మార్చి, ఏప్రిల్ ఈ రెండు నెలల్లో పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది. ఈ సీజన్‌లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి. జనం సమూహాలుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని..

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: వీడియో కాల్‌తో పెళ్లి చేసుకున్న యువ జంట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2020 | 9:01 PM

ప్రతీఏటా మార్చి, ఏప్రిల్ ఈ రెండు నెలల్లో పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది. ఈ సీజన్‌లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి. జనం సమూహాలుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరించడంతో ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. దీంతో పెళ్లిళ్లకు, పలు రకాల ఫంక్షన్‌లను ప్రజలు క్యాన్సిల్ చేసుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి.

ఈ ఎఫెక్ట్‌తోనే టాలీవుడ్ హీరో నితిన్, నిఖిల్‌లు కూడా తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వీడియో కాల్స్‌ ద్వారా వివాహాలను చేసుకుంటున్నారు. అలా ఓ ప్రేమ జంట తమ దూరాన్ని భరించలేక వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేసుకున్నారు.

ముంబైకి చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ ప్రీత్ సింగ్, ఢిల్లీకి చెందిన అమ్మాయి నీత్ కౌర్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో వధువు, వరుడు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఆరు నెలల కిందటే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్నామని.. కానీ కరోనా వైరస్ రూపంలో తమ పెళ్లికి అడ్డంకులు ఎదురయ్యాయన్నాడు. కానీ ఏ సమస్యకైనా ఏదో ఒక మార్గం ఉంటుంది కదా.. అందుకే వీడియో కాల్ ద్వారా ఒక్కటయ్యామన్నాడు. అలాగే హనీమూన్‌ని వాయిదా వేసుకున్నట్లు అతను తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..