వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. దీంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చెబుతున్న సూచనలను పాటిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు..

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 4:05 PM

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. దీంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చెబుతున్న సూచనలను పాటిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం పరిశుభ్రంగా ఉంటూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. కరోనా గురించి ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని… జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. సిగరేట్‌, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరమవ్వాలన్నారు. వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలన్నారు. దుష్ర్పచారాలను నమ్మకూడదని.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తతో ఉండాలని సూచించారు. వీలైనంత వరకూ యోగా, ధ్యానం చేయాలన్నారు. రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో ఆలోచించాలన్నారు. ఇంత వరకూ కరోనాకు మందు కనిపెట్టలేదు కాబట్టి రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో ఆలోచించాలన్నారు.

టెలిఫోన్‌ ద్వారా కానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కానీ ఎక్కడికక్కడ వర్ఛువల్ ఆఫీసు రన్‌ చేస్తూ కార్యకలాపాలు సాగించవచ్చని చెప్పారు చంద్రబాబు. మన రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వారంలో వెయ్యి శాతానికి పైగా కరోనా పెరిగిందని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. ప్రజలకు వాస్తవాలు చెప్పి వారిని మరింత సమాయత్తం చేయాలన్నారు. భౌతిక దూరం పాటించాలని.. మత, రాజకీయపరమైన సదస్సులు, వివాహ వేడుకలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇంటిదగ్గరే ఉంటున్నారని.. ఏపీలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని చంద్రబాబు అన్నారు.

అలాగే.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. పని చేస్తేగానీ పూటగడవని పేద ప్రజలను ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్ధిక ప్యాకేజీని ఇచ్చాయని.. ఢిల్లీ సర్కార్‌ కూడా అయిదు వేల రూపాయలు ఇస్తోందన్నారు. ఏపీలో కూడా పేదలకు తొలి విడతగా కనీసం అయిదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌, పెన్షన్లలో అనేక మందికి కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి:

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..

రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..

రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..

మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కష్టాలు

ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు

బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం

'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ