భారత్‌కు అమెరికా భారీ ఆర్థిక సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. అమెరికా భారత్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. యూఎస్‌ఏఐడీ ద్వారా 2.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ నియంత్రణకు ఈ సహాయం ఎంతగానో..

  • Tv9 Telugu
  • Publish Date - 6:16 pm, Mon, 6 April 20
భారత్‌కు అమెరికా భారీ ఆర్థిక సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. అమెరికా భారత్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో 4 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. ఇప్పటికే ఈ కరోనాను అడ్డుకునేందుకు ప్రధాని రకరకాల చర్యలు చేపడుతూనే ఉన్నారు. నిజానికి కరోనా కేసులు అధికమైతే.. కట్టడి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అటు ఆర్థికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ మన దగ్గర అంత శక్తి లేదు. అందుకే ప్రధాని ఇలా లాక్‌డౌన్ విధించారు.

ఇక భారత్‌కు అమెరికా యూఎస్‌ఏఐడీ ద్వారా 2.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ నియంత్రణకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరోనాపై పోరులో యూఎస్‌ఏఐడీ, వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం, ఇతర సంస్థలు భారత్‌తో కలిసి పనిచేస్తాయని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రపంచానికి పెను ముప్పులా మారిందని, అన్ని అంతర్జాతీయ ప్రభుత్వాలూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా గడిచిన 20 ఏళ్లలో భారత్‌కు అమెరికా మొత్తం 300 కోట్ల డాలర్లు ఆర్థిక సాయం అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు జస్టర్. ఇందులో 140 కోట్ల డాలర్లు ఆరోగ్య రంగానికి ఇచ్చినవేనని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: 

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..

రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..

రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..