డీజీపీ సంచలన నిర్ణయం.. ఇక అలా చేసే వారిపై హత్యాయత్నం కేసులే..!

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 60 వేల మందిని పొట్టనపెట్టుకోగా.. మరో 12లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో మనదేశంలో కూడా.. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వందకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఓ క్రమంలో పాజిటివ్ కేసులు దేశంలో అదుపులోకి వస్తున్నాయనుకున్న క్రమంలో.. మర్కజ్‌ వ్యవహారం.. దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ తబ్లిగీ జమాతే సమావేశంలో పాల్గొన్న విదేశీయుల […]

డీజీపీ సంచలన నిర్ణయం.. ఇక అలా చేసే వారిపై హత్యాయత్నం కేసులే..!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 6:43 PM

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 60 వేల మందిని పొట్టనపెట్టుకోగా.. మరో 12లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో మనదేశంలో కూడా.. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వందకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఓ క్రమంలో పాజిటివ్ కేసులు దేశంలో అదుపులోకి వస్తున్నాయనుకున్న క్రమంలో.. మర్కజ్‌ వ్యవహారం.. దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ తబ్లిగీ జమాతే సమావేశంలో పాల్గొన్న విదేశీయుల ద్వారా.. కరోనా వైరస్‌ వారికి కూడా వ్యాపించింది. అయితే ఈ విషయ ఆలస్యంగా బయటపడింది. అప్పటికే తబ్లిగీ జమాతే సమావేశాని హాజరైన వారు.. వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వారిలో చాలా మందికి ఈ వైరస్‌ లక్షణాలు బయటపడటంతో.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించే పనిలో పడ్డాయి. అయితే అనేక చోట్ల ఈ తబ్లీగీ జమాతే సమావేశానికి హాజరైన వారు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా.. తప్పించుకు తిరుగుతున్నారు. ఒకవేళ వారిని గుర్తించినా.. పలుచోట్ల అధికారులపైకి తిరగబడుతున్నారు. అంతేకాదు.. ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందిపై కూడా ఉమ్మేస్తూ.. వికృత చేష్టలకు పాల్పుడుతున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వెనుకడుగు వేస్తోంది.

తాజాగా ముందు జాగ్రత్తగా.. హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఎవరైన కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు.. ఇతరులపై ఉమ్మివేస్తే.. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ది హెచ్చరించారు. అంతేకాదు.. కరోనా రోగి ఉమ్మివేయడం వల్ల ఎవరైనా మరణించినా.. వారిపై మర్డర్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఓ వ్యక్తి.. కరోనా మహమ్మారిపై విజయవంతంగా గెలిచి.. కరోనా బారినుంచి బయటపడ్డాడు.