బుల్లి తెర‌పై ఈమె నయా సెన్సేష‌న్..వ‌ర్షిణి…అందాల వాహిని

వెండితెర‌పై ప్ర‌స్తుతం హీరోయిన్స్ ఇలా వ‌చ్చి అలా మెరిసి వెళ్లిపోతున్నారు. ద‌శాబ్దాల పాటు చిత్ర‌సీమ‌ను ఏలుతోన్నవాళ్లను వేళ్ల‌మీదే లెక్కేసుకోవాలి. కానీ బుల్లితెర‌పై సీన్ వేరు. ఒక్కసారి ఓన్ చేసుకున్నారంటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ అంత ఈజీగా మ‌ర్చిపోరు. తెలుగు బుల్లితెర సూప‌ర్ స్టార్ సుమ ద‌గ్గ‌ర్నుంచి ఝూన్సీ, ఉద‌య‌భాను..ఈ మ‌ధ్య కాలంలో అన‌సూయ‌, రేష్మి..తెలుగు లోగిళ్ల‌లో ద‌శాబ్దాల పాటు తెగ సంద‌డి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో త్వ‌ర‌లో చేరిపోయేలా క‌నిపిస్తోంది యంగ్ యాంక‌ర్ వ‌ర్షిణి. […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:58 pm, Mon, 6 April 20
బుల్లి తెర‌పై ఈమె నయా సెన్సేష‌న్..వ‌ర్షిణి...అందాల వాహిని

వెండితెర‌పై ప్ర‌స్తుతం హీరోయిన్స్ ఇలా వ‌చ్చి అలా మెరిసి వెళ్లిపోతున్నారు. ద‌శాబ్దాల పాటు చిత్ర‌సీమ‌ను ఏలుతోన్నవాళ్లను వేళ్ల‌మీదే లెక్కేసుకోవాలి. కానీ బుల్లితెర‌పై సీన్ వేరు. ఒక్కసారి ఓన్ చేసుకున్నారంటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ అంత ఈజీగా మ‌ర్చిపోరు. తెలుగు బుల్లితెర సూప‌ర్ స్టార్ సుమ ద‌గ్గ‌ర్నుంచి ఝూన్సీ, ఉద‌య‌భాను..ఈ మ‌ధ్య కాలంలో అన‌సూయ‌, రేష్మి..తెలుగు లోగిళ్ల‌లో ద‌శాబ్దాల పాటు తెగ సంద‌డి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో త్వ‌ర‌లో చేరిపోయేలా క‌నిపిస్తోంది యంగ్ యాంక‌ర్ వ‌ర్షిణి. హీరోయిన్ ఫీచ‌ర్స్ ఉన్న ఈ అమ్మాయి ఇటీవ‌ల కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ప‌లు ఎంట‌ర్టైన్ మెంట్ షోస్ తో పాటు ఈవెంట్స్ లో కూడా క‌నిపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో అటెన్ష‌బ్ గ్రాబ్ చేస్తోంది. కెరీర్ తొలినాళ్ల‌లో డాన్స్ రాక‌పోయినా ఇప్పుడు హాట్ స్టెప్పుల‌తో దుమ్ము రేపుతోంది. ఈ భామ త్వ‌ర‌లో సినిమాల్లో కూడా స‌త్తా చాటే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లామ‌ర్ విష‌యంలో వ‌ర్షిణి ఎక్కువ మార్కులు సంపాదిస్తోంది..ఇంకొంచెం టైమింగ్ ని ఫాలో అయితే బుల్లితెర‌పై ఇక ఈ భామ‌ను ఆప‌డం క‌ష్ట‌మే. అన్న‌ట్టు ఈ రోజు వ‌ర్షిణి బ‌ర్త్ డే..ఆమెకు తెలుగు తెర‌పై మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని విష్ చేద్దాం.