Gold Prices Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంత ఉందంటే..?
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల స్థిరంగా కొనసాగగా.. మళ్లీ పెరుగుతూ వస్తోన్నాయి. సోమవారం పెరిగిన ధరలు.. మంగళవారం కూడా అదే బాట పట్టాయి. నేడు గోల్డ్ రేటు మరోసారి పెరగడంతో కొనుగోలు చేసేవారు షాక్ అవుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన ధరలు.. సోమవారం నుంచి మళ్లీ పెరుగుదల నమోదు చేస్తున్నాయి. మంగళవారం గోల్డ్ రేట్లు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. పండుగల సీజన్ కావడంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. దీనితో పాటు అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరుగుతుండటంతో.. భారత్‌లో కూడా వీటి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,36,160గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,810 వద్ద కొనసాగుతోంది.
-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,36,160గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,810 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,37,140 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,710గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,36,160గా, 22 క్యారెట్లు రూ.1,24,810గా ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,36,310 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,24,960 వద్ద కొనసాగుతోంది
వెండి ధరలు ఇలా..
-ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,31,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగింది
-విజయవాడలో కేజీ వెండి రూ.2,31,100గా ఉండగా.. విశాఖపట్నంలో కూడా అలాగే ఉంది. ఇక చెన్నైలో కూడా అవే ధరలు ఉన్నాయి.
-బెంగళూరులో కేజీ వెండి రూ.2,19,100 వద్ద పలుకుతోంది
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,19,100 వద్ద కొనసాగుతోంది




