హమ్మయ్య.. కరోనా గండం నుంచి గట్టెక్కిన రెండు రాష్ట్రాలు..

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఓ రేంజ్‌లో వణికిస్తోంది. కంటికి కనిపించని ఓ వైరస్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇక మనదేశంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు దీని బారినపడ్డాయి. అయితే ప్రస్తుత ఈ కరోనా మహమ్మారి నుంచి దేశంలో రెండు రాష్ట్రాలు సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒకటి మణిపూర్‌ కాగా.. మరొకటి గోవా రాష్ట్రం. […]

హమ్మయ్య.. కరోనా గండం నుంచి గట్టెక్కిన రెండు రాష్ట్రాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 5:57 PM

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఓ రేంజ్‌లో వణికిస్తోంది. కంటికి కనిపించని ఓ వైరస్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇక మనదేశంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు దీని బారినపడ్డాయి. అయితే ప్రస్తుత ఈ కరోనా మహమ్మారి నుంచి దేశంలో రెండు రాష్ట్రాలు సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒకటి మణిపూర్‌ కాగా.. మరొకటి గోవా రాష్ట్రం. కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి. తమ రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు మణిపూర్‌ సీఎం బిరేందర్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులేవీ లేవంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తమ దగ్గర వైద్య సిబ్బందితో పాటు.. రాష్ట్ర ప్రజల సహకారంతోనే దీనిని సాధించినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కూడా కఠినంగా అమలు చేయడం మరో కారణమని తెలిపారు.

ఇక గోవా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకుంది. రాష్ట్రంలో కరోనా సోకిన ఏడుగురు రోగులు కోలుకున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఏప్రిల్ 3 తర్వాత రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. కాగా. కేంద్ర ప్రభుత్వానుసారం.. మే 3 వరకు లాక్‌డౌన్ విధిగా అమలు చేస్తామన్నారు.

కాగా..అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కరోనా సోకిన వారంతా కోలుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!