ISRO: విజన్ 2047.. చంద్రయాన్-4, శుక్రయాన్.. భారత్‌తో మామూలుగా ఉండదిక..
చంద్రయాన్-3 అనంతరం ఇస్రో మరిన్ని ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2028లో జపాన్‌తో కలిసి చంద్రయాన్-4 (లూపెక్స్) మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితల నమూనాలను సేకరించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యంతో పాటు, 2035 నాటికి భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే శుక్ర గ్రహ రహస్యాలను ఛేదించేందుకు శుక్రయాన్ మిషన్‌పై కూడా వేగంగా పనులు కొనసాగిస్తోంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఘనత అంటే చంద్రయాన్ ప్రయోగానికి ముందు చంద్రయాన్ ప్రయోగం తర్వాత అని చెప్పాలి. ప్రపంచ దేశాల దృష్టి భారత్ పై పడేలా చేసిన ప్రయోగం చంద్రయాన్.. చంద్రయాన్ – 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాలతో సత్తా చాటిన ఇస్రో ప్రస్తుతం గగన్ యాన్, అంతరిక్షంలో భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక చంద్రయాన్ సిరీస్‌లో నాలుగో ప్రయోగం చేపడతామని గతంలో ప్రకటించిన ఇస్రో త్వరలోనే లాంచ్ కి సిద్ధవుతోంది. ఇస్రో – జపాన్ సంయుక్తంగా కలిసి లుపెక్స్(Lupex )అనే ప్రాజెక్ట్ ద్వారా 2028లో చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇప్పటివరకు చంద్రయాన్ పేరుతో చంద్రుడిపై జరిగిన మూడు ప్రయోగాల్లో చంద్రుడి ఉపరితలం మీద ప్రయోగాలు జరిగాయి. అయితే ఈసారి ప్రయోగం మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుందని ఇస్రో తెలిపింది.
చంద్రునిపై నమూనాలను సేకరించి తిరిగి భూమి మీదకు వచ్చే ప్రయోగ మిషన్ ఏర్పాట్లను ఇస్రో అతి త్వరలోనే చేపట్టనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించగా అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు మరో మైలురాయి కాబోతోంది. 2028లో భారత్ జపాన్ సహకారంతో నిర్వహించబోతున్న చంద్రయాన్ 4 ప్రయోగంలో చంద్రుని ఉపరితలంపై కి 2040లో వ్యోమగాములను పంపే ప్రక్రియ కీలకం కాబోతోంది. 2040 నాటికి వ్యోమగాములను చంద్రునిపై కి పంపి సేఫ్ ల్యాండింగ్‌ను సాధించాలని లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. ఇస్రో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం అయిన భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్‌పై కూడా పనులు జరుగుతున్నాయి.. దాని ఐదు మాడ్యూళ్లలో మొదటిది 2028 నాటికి మొదలు అవుతాయి. 2035 కి భారత సొంత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది..
శుక్రయాన్ కోసం ఇప్పటికే పని మొదలు..
శుక్రయాన్ కోసం ఇప్పటికే పని మొదలు పెట్టింది ఇస్రో. 2047లో భారీ అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చంద్రయాన్ ఆదిత్య యాన్ , సముద్రయాన్ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో శుక్ర గ్రహంపై ప్రయోగం కోసం శుక్రయాన్ చేపట్టేందుకు సిద్దమైంది. చంద్రుడిపై ఉన్న వాతావరణానికి శుక్రుడిపై ఉన్న వాతావరణానికి అసలు పోలికే ఉండదు.. అస్సలు చంద్రుడిపై వాతావరణమే ఉండదు. చంద్రుడిపై ఉన్న అలాగే శుక్రుడి ఉపరితలంపై ఉన్న తేడాలను తెలుసుకోవడం. శుక్ర గ్రహంపై కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండడం లాంటి విషయాలపై అధ్యయనం చేయనుంది ఇస్రో. ఉష్ణోగ్రతలు భూమితో పోల్చితే 90 శాతం వరకు అధికంగా ఉంటాయని ఇప్పటికే తేలింది.. శుక్ర గ్రహంపై వాతావరణ పరిస్థితులపై అధ్యయనం.. అగ్ని పర్వతాల స్వభావం ఎలా ఉంది.. అయినోస్పిరిక్ స్వభావం ఎలా ఉంటుంది అన్న వాటిపై కీలకంగా ప్రయోగం జరగనుంది.. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాన్ని తయారు చేయనుంది ఇస్రో.. 2047 లో ఇస్రో చేపట్టనున్న కీలక ప్రయోగాలకు భారత్ నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం వేదిక కానుంది.. అక్కడి నుంచే కీలకమైన ప్రయోగాలను ఆపరేట్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి..
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
