‘మాకేదీ ప్రొటెక్షన్ ?’ లండన్ లో భారత సంతతి మహిళా డాక్టర్ నిరసన

తమకు సర్జికల్ గౌన్స్ తో బాటు పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ (పీపీఈ) ఇవ్వాలంటూ లండన్ లో భారత సంతతికి చెందిన మహిళా డాక్టర్ నిరసనకు దిగారు. 6 నెలలగర్భిణి అయిన డాక్టర్ మీనాల్ విజ్ అనే ఈమె డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం

'మాకేదీ ప్రొటెక్షన్ ?' లండన్ లో భారత సంతతి మహిళా డాక్టర్ నిరసన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 20, 2020 | 6:09 PM

తమకు సర్జికల్ గౌన్స్ తో బాటు పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ (పీపీఈ) ఇవ్వాలంటూ లండన్ లో భారత సంతతికి చెందిన మహిళా డాక్టర్ నిరసనకు దిగారు. 6 నెలలగర్భిణి అయిన డాక్టర్ మీనాల్ విజ్ అనే ఈమె డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం ముందే ఈ ప్రొటెస్ట్ ప్రారంభించారు. బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీసు వైద్య సిబ్బందికి వీటి కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆమె అంటున్నారు. ‘ప్రొటెక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మీనాల్..ఒంటరి పోరాటానికి దిగారు. 27 ఏళ్ళ ఈమె.. ఈ కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కరోనా రోగులకు సేవలందిస్తున్న ఎంతోమంది వైద్య సిబ్బంది ఇవి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కూడా వీటి కొరతను ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. అయితే టర్కీ నుంచి ఈ పీపీఈలు ఇప్పటికే రావలసి ఉందని, జాప్యం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. అనేక హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు చేతులకు కేవలం గ్లోవ్స్ ధరించి సేవలు అందించవలసి వస్తోంది. వైద్యులు ప్రొటెక్టివ్ సూట్ల బదులు ఏప్రన్లు (తెల్లని గౌన్లు) ధరించాలని ప్రభుత్వమే చెబుతోంది. పీపీఈ లు లేక పలువురు వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారు. వీరిలో చాలామంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు కూడా.