AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మీరు వాడేది అసలు నోటా..? నకిలీదా..? ఈ మూడు గుర్తులతో ఇట్టే పసిగట్టొచ్చు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ నోట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. మార్కెట్లో ఎక్కువగా రూ.500 నకిలీ నోట్ల చలామణిలో ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని ప్రజలు సులువుగా గుర్తు పట్టే విధంగా అవగాహన కల్పిస్తోంది. ఇంతకు నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..?

RBI: మీరు వాడేది అసలు నోటా..? నకిలీదా..? ఈ మూడు గుర్తులతో ఇట్టే పసిగట్టొచ్చు..
Currancy Notes
Venkatrao Lella
|

Updated on: May 30, 2026 | 8:34 AM

Share

నకిలీ కరెన్సీ నోట్లు దేశంలో విస్తృతంగా చలామణిలో ఉన్నాయి. దీంతో వినియోగదారులకు ఏది నిజమైన నోటు..? ఏది నకిలీ నోటు? అనేది గుర్తించడం కష్టతరంగా మారింది. ఎక్కువగా రూ.500 నకిలీ నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. రూ.500 నకిలీ నోట్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నట్లు గుర్తించింది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.500 నకిలీ నోట్ల చలామణి 20 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇక అన్ని నోట్ల పరంగా చూస్తే 5.7 శాతం పెరిగింది. దీంతో నకిలీ నోట్ల బారిన పడకుండా ప్రజలను ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలనే దానిపై అవగాహన కూడా కల్పిస్తోంది. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నకిలీ నోట్లను సులువుగా గుర్తించవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎలా నకిలీ నోట్లను గుర్తించాలో ఒకసారి చూద్దాం.

నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి..?

-https://rbikehtahai.rbi.org.in/ పోర్టల్‌లోకి వెళ్లండి

-మీ బ్యాంక్ నోట్స్ గురించి తెలుసుకోండి అనే ఆప్షన్ ఎంచుకోండి

-అక్కడ అన్నీ కరెన్సీ నోట్లు మీకు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే కరెన్సీ నోటుకు సంబంధించిన ఫీచర్ కనిపిస్తాయి

-అన్నీ మార్క్ చేసి వివరించండి

-జాగ్రత్తగా నోట్లను గమనించడం ద్వారా ఏది ఓరిజినల్.. ఏది నకిలీ అనేది సులభంగా గుర్తించవచ్చు

ఇవి ఒకసారి చెక్ చేయండి

-కరెన్సీ నోట్లలో ఉండే ఆకుపచ్చ రంగులో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వంచి చూస్తే అది ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. ఒకవేళ గీత రంగు మారకపోతే అది నకిలీ నోటు అని గుర్తించాలి

-కరెన్సీ నోటు కాస్త తడిచినా చిరిగిపోదు. ఎందుకంటే కరెన్సీ నోట్లను సాధారణ పేపర్‌తో తయారుచేయరు. దీనిని గమనించి మీరు ఏది అసలు నోటు.. ఏది నకిలీ అనేది గుర్తించవచ్చు

-ఇక కరెన్సీ నోట్ల వెనుక స్వచ్చ భారత్ లోగో, స్లోగన్, లాంగ్వేజ్ ప్యానెల్, రోడ్ ఫోర్ట్ ఉంటుంది

-అసలు నోటులో మహాత్మా గాంధీ ఫొటో వెలుతురులో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నోటు విలువ కూడా అక్కడ కనిపిస్తుంది

Follow Us