COVID-19: కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజూకూ భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్

COVID-19: కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు
Corona Cases in Maharashtra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2021 | 1:32 AM

Maharashtra Corona cases: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజూకూ భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్ సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నిత్యం రికార్డు స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 40,414 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,13,875 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 54,181 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 17,874 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,33,2453 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,25,901 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటంతో.. హోలీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను మొదలుపెట్టారు. ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

అయితే.. ప్రజల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి నిబంధనలు పాటించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నా.. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా ఆదివారం కోవిడ్‌-19 కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్దవ్‌ పలు సూచనలు, సలహాలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదని ప్రజలను హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఆయన పలు సూచనలు చేశారు.

Also Read:

మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ… ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే…

కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదు.. అధికారుల సమావేశంలో సీఎం