మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ… ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే…

మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హో..

మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ... ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే...
Coronavirus Curfew
Follow us

|

Updated on: Mar 28, 2021 | 9:12 PM

మహారాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోళీ పండగ సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ కర్ప్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోళీ పండగ సందర్భంగా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాగా, దేశ వ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా పాజిటివ్‌ కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఇక ఈ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా పలు రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించింది.

అయితే ప్రజల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి నిబంధనలు పాటించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నా.. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో పాజిటివ్‌ కేసులు పెరుగుదలకు కారణమవుతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆదివారం కోవిడ్‌-19 కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్దవ్‌ పలు సూచనలు, సలహాలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదని అన్నారు. ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి: కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదు.. అధికారుల సమావేశంలో సీఎం

73 ఏళ్ల వయసులో ‘వరుడు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చిన బామ్మ.. ఒంటరిగా ఉండలేకపోతున్నానంటున్న వద్ధురాలు

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి