ఏప్రిల్ 1 నుంచి ఆ చెల్లింపులకూ ‘నో’ ఛాన్స్.. స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌కు బ్రేక్ వేసిన కేంద్రం
Automatic EMI Bill Pay: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. ఆటోమేటిక్‌గా జరిగే చెల్లింపుల (స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్) విధానంలో..
ఆన్‌లైన్ మోసగాళ్లకు చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. ఆటోమేటిక్‌గా జరిగే చెల్లింపుల (స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్) విధానంలో మార్పులు చేసింది. ప్రతినెలా కట్టే హోం లోన్స్ వాయిదాల నుంచి టెలిఫోన్ బిల్లు వరకు… వాటంతట అవే ఖాతా నుంచి చెల్లింపులు జరిగేలా ‘స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్’ ఇస్తుంటారు చాలా మంది.
ఇకపై… వేటికిపడితే వాటికి ఆటోమేటిక్ చెల్లింపులు కుదరవు. హోమ్ లోన్స్ , వెయికిల్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎల్‌ఐసీ వంటి కొన్ని సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సేవలు, డీటీహెచ్ బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి సేవలకు ఆటోమేటిక్‌గా చెల్లింపులుకు బ్రేక్ వేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సేవలకు ఖాతాదారులు ఇచ్చిన ‘స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్’ ఏప్రిల్ 1 నుంచి డీయాక్టివేట్ అవుతాయి. పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు మెయిల్స్ రూపంలో ఈ సమాచారాన్ని ఇప్పటికే పంపించాయి.
ఇకపై ఇలాంటి సేవలకు బిల్లులు చెల్లించాలంటే ఆయా కంపెనీల వెబ్‌సైట్ లేదా యాప్‌ల ద్వారా చెల్లించుకోవాల్సిందే. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా మీరు చెల్లింపులు చేసుకోవడంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే… ఇలాంటి చెల్లింపులు చేస్తున్న సమయంలో తప్పకుండా ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీని ఫిల్ చేస్తేనే మీ చెల్లింపు ముగుస్తుంది.
బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంపైనే ఈ లావాదేవీలు ‘సక్సెస్’ అయ్యే అవకాశముంది. ఇలాంటి నిర్ణయం తీసుకురావడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్న సమయంలో దొంగచాటుగా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న నిల్వలను కాజేస్తున్నారు. తప్పుడు మెసెజ్‌లు పంపించి దోచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో సైబర్ నేరాలకు పెద్ద బ్రేక్ పడినట్లైంది.