Karnataka CD row: కర్నాటకలో రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తు రూట్ మార్చుతున్నారంటున్న సీడీ లేడీ..
Sex CD row: కర్నాటకలో రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్... ఫ్యామిలీని బయపెట్టి కేసు దర్యాప్తు రూట్ మారుస్తున్నారని సీడీ లేడీ కొత్త షాక్ ఇచ్చారు. తల్లిదండ్రులు కాంగ్రెస్ నేత పేరు చెప్పడం....
కర్నాటకలో రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్… ఫ్యామిలీని బయపెట్టి కేసు దర్యాప్తు రూట్ మారుస్తున్నారని సీడీ లేడీ కొత్త షాక్ ఇచ్చారు. తల్లిదండ్రులు కాంగ్రెస్ నేత పేరు చెప్పడం…. దాని వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందంటోంది. తనకు రక్షణ కల్పిస్తే బయటకు వచ్చేందుకు సిద్ధమని తెలిపారు.
కర్నాటక సీడీల కేసులో ట్విస్టులు తెలుగు సీరియల్‌కు మించిపోయాయి. శనివారం రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. సిట్ ఎదుట సీడీలేడీ తల్లిదండ్రులు, తమ్ముళ్లు హాజరయ్యారు. వాళ్లను సుమారు ఆరు గంటల పాటు విచారించింది సిట్ బృందం. ఎంక్వయిరీ తర్వాత బయటకు వచ్చిన ఆమె పేరెంట్స్ బాంబ్ పేల్చారు.
సీడీ తయారీ, తమ కుమార్తె అజ్ఞాతంలోకి వెళ్లడానికి కేపీసీసీ చీఫ్ శివకుమార్ కారణమంటూ చేసిన పేరెంట్స్ స్టేట్‌మెంట్‌కేసును కొత్త మలుపు తిప్పింది. కన్నింగ్ పాలిటిక్స్‌కు తన కుమార్తె బలైపోయిందన్నారు సీడీ లేడీ తండ్రి. పార్టీల రాజకీయాల్లో తమను బలి తీసుకోవద్దని వేడుకున్నారామె పేరెంట్స్.
పేరెంట్స్ స్టేట్‌మెంట్‌పై అనుమానం వ్యక్తం చేశారు సీడీ యువతి. తన పేరెంట్స్‌కు ఏమీ తెలియదని… వారిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. సీడీ వెలుగులోకి వచ్చిన వెంటనే తనకు పరిచయం ఉన్న నరేశ్‌ను కలుసుకున్నానని.. రాజకీయ నాయకుల మద్దతు అవసరమని ఆయనే చెప్పారన్నారు.
తన ఫ్రెండ్‌తో కలిసి సిద్ధరామయ్య, శివకుమార్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించానన్నారా యువతి. తనకు భద్రత కల్పించాలని కోరేందుకే వారి వద్దకు వెళ్లానని తెలిపారు. వారితో భేటీ సాధ్యం కాలేదన్న ఆమె తనకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తనతో సహా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని 24 రోజులుగా కోరుతూ వస్తున్నా… ఇంతవరకు ఆ దిశగా చర్యల్లేవన్నారు. త్వరలో విచారణకు హాజరై అధికారులకు అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. కేసుపై వెనక్కి తగ్గాలనే ఒత్తిడి తనపై తీసుకొస్తున్నారని… జర్కోళీ పేరు రాసి చనిపోవాలని ఉందంటూ ఆరోపించారామె.
యువతి పేరెంట్స్ స్టేట్‌మెంట్‌తో విషయంపై క్లారిటీ వచ్చేసిందంటున్నారు రమేష్ జర్కోళీ. శివకుమార్ తనను తాను మహా నాయకుడిని అనుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక శివకుమార్ ఉన్నట్లు 11 ఆధారాలు తన వద్ద ఉన్నాయి. సీడీలో కనిపించిన యువతి ఎస్టీ అని తనకు తెలియదు. ఆమె తల్లిదండ్రులే ఈ విషయాన్ని ప్రకటించారు జర్కోళీ. శివకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన బీజేపీ… తన పదవికి శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
కేసుల పేరుతో బెదిరిస్తే భయపడేది లేదన్నారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. కేసును పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు, ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కావడంతో తనను కలుసుకునేందుకు వందల మంది వస్తుంటారని… అందరితో తనకు వ్యక్తిగత పరిచయం ఉండదని వివరణ ఇచ్చారు. ఓ మీడియా సంస్థకు చెందిన నరేశ్‌తో తనకు మొదటి నుంచీ పరిచయం ఉంది. ఆయన నివాసానికి చాలాసార్లు వెళ్లానని ఆయన తెలిపారు.
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన రాసలీలల సీడీ కేసు కాంగ్రెస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. తల్లిదండ్రులోపాటు ఆమె సోదరుడి వేళ్లు కూడా కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. రాజకీయాలకు తమ సోదరి బలైపోతోంది. ఆమెను గుప్పెట్లో పెట్టుకున్న నాయకులు తక్షణమే సురక్షితంగా విడిచి పెట్టాలన్నారు ఆ యువతి సోదరుడు.
యువతి రమేశ్ జార్ఖిహొళిపై ఆరోపణలు చేస్తుండగా, సిట్ ముందు విచారణకు హాజరైన కుటుంబ సభ్యులు మాత్రం ఈ కుట్ర వెనుక శివకుమార్ ఉన్నారని ఆరోపించారు. వీడియోలో ఉన్నది తాను కాదని గ్రాఫిక్స్‌తో దాన్ని తయారు చేశారని తన కుటుంబ సభ్యులతో యువతి మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అయింది. వీడియోలో ఆమె మాట్లాడిన యాసకు, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ విడుదల చేసిన వీడియోల్లోని యాసకు పొంతన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో కాంగ్రెస్ లీడర్స్ నేమ్స్ వినిపిస్తున్నందున సిద్ధరామయ్య తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. తదుపరి యాక్షన్‌పై డిస్కషన్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉన్నందున ఎవరూ ఫోన్లో ఈ విషయంపై మాట్లాడొద్దని హెచ్చరించారు. నేరుగా పార్టీ నాయకులకు సూచించారని సమాచారం.
కేసు దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రి యడియూరప్ప ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సిట్‌లో అధికారిగా ఉన్న సందీప్ పాటిల్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.