ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో అమిత్ షా రహస్య సమావేశం ! సరి కొత్త అయోమయం !
హోం మంత్రి అమిత్ షా ...ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య రహస్యంగా జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహమదాబాద్ లో తన సహచరుడుప్రఫుల్ పటేల్ తో కలిసి పవార్ ఓ ఫామ్ హౌస్ లో అమిత్ షాను కలిశారని గుజరాత్ పత్రికలు పేర్కొన్నాయి.
హోం మంత్రి అమిత్ షా …ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య రహస్యంగా జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహమదాబాద్ లో తన సహచరుడుప్రఫుల్ పటేల్ తో కలిసి పవార్ ఓ ఫామ్ హౌస్ లో అమిత్ షాను కలిశారని గుజరాత్ పత్రికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అమిత్ షాను ప్రశ్నించగా ఆయన అవునని గానీ, కాదని గానీ చెప్పకుండా మౌనం వహించారు. అసలు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయలేం అన్నారు. అసలే మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎం ఉధ్దవ్ థాక్రేకి లేఖ రాయడం, దానిపై రాష్ట్రంలో పెద్దఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో అమిత్ షా, శరద్ పవార్ ల మధ్య సమావేశం ఎందుకు జరిగిందన్నది పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఈ లేఖ రాష్ట్రంలో సంక్షోభాన్నే సృష్టించింది. ఉధ్ధవ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఇటు రాష్ట్రంలోనూ, అటు పార్లమెంటులో కూడా బీజేపీ డిమాండ్ చేసింది. పైగా అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించలేదని శివసేన నేతృత్వంలోని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ మాత్రమే.. ఇందులో అనిల్ దేశ్ ముఖ్ తప్పేమీ లేదని, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసిన విషయం గమనార్హం.
ఇలా ఉండగా తన మీద వచ్చిన ఆరోపణలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జిచేత విచారణ జరిపించాలని సీఎం ఉధ్ధవ్ థాక్రే నిర్ణయించారని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. ఈ అభియోగాలమీద ఎంక్వయిరీ జరిపించాలని తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఆయన చెప్పారు. ఏమైనా మహారాష్ట్రలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం.. ‘మహా వికాస్ అఘాడీ’ ఇంకా ఈ సరికొత్త దుమారం మధ్య నలుగుతూనే ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి: VH on HCA : ‘హెచ్ సి ఎ’ అవినీతితో భ్రష్టు పట్టింది.. స్టేడియంలు లేవు.. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు : మీటింగ్ నుంచి వైదొలుగుతూ వీహెచ్
Viral News: కోళ్ల పారం నుంచి పిల్లి అరుపులు.. భయంతో పరిగెత్తుకెళ్లిన ఫౌల్ట్రీ రైతు.. షాకింగ్ సీన్