Viral News: కోళ్ల పారం నుంచి పిల్లి అరుపులు.. భయంతో పరిగెత్తుకెళ్లిన ఫౌల్ట్రీ రైతు.. షాకింగ్ సీన్
జాలి, కరుణ, ప్రేమ వంటి ఎమోషన్స్ మనుషుల్లో మాత్రమే ఉంటాయని భావిస్తారు చాలామంది. జంతువులు చాలా క్రూరమైనవి అని వాటికి భావోద్వేగాలు ఉండవని అనుకుంటారు.
జాలి, కరుణ, ప్రేమ వంటి ఎమోషన్స్ మనుషుల్లో మాత్రమే ఉంటాయని భావిస్తారు చాలామంది. జంతువులు చాలా క్రూరమైనవి అని.. వాటికి భావోద్వేగాలు ఉండవని అనుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మనుషుల్లో అసహనం, కోపం, ద్వేషం పెరిగిపోయాయి. బంధాలు, బంధుత్వాలకు కూడా విలువివ్వడం మానేశారు చాలామంది. కానీ జంతువులు మాత్రం జాతి వైరాన్ని మరిచి.. మంచి మనసును చాటుకుంటున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇరాక్‌లో చోటుచేసుకుంది. ఆ దేశంలోని గోరన్ ఎ సుర్చి అనే రైతు తన కోళ్ల ఆవరణలో ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశాడు.
తొలుత అతడి కోళ్ల ఫారం నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో పిల్లి తన కోళ్లను అటాక్ చేసిందని భావించిన సదరు రైతు.. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత ఆయనకు అసలు విషయం అర్థమైంది. కోడి అక్కడ తన రెక్కల కింద మూడు పిల్లి పిల్లల్ని దాచి ఉంచింది. తీరా పరిశీలిస్తే.. ఆ పిల్లల తల్లి చనిపోయి ఉంది. దీంతో ఆ మూడు పిల్లలు అమాయకంగా అరవడం ప్రారంభించాయి. ఇప్పుడు వాటికి ప్రేమ, సంరక్షణ అవసరం. ఈ క్రమంలో ఆ పిల్లల వేధనను అర్థం చేసుకున్న కోడి.. వాటికి అమ్మలా మారింది. వాటిని అక్కున చేర్చుకుని తన పిల్లల్లా చూసుకోవడం ప్రారంభించింది. మనసంతా మమతతో నిండిన ఈ కోడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త మీ మనసును కూడా తాకింది కదూ..!
Also Read: విచిత్రం.. నీటిలో మునగకుండా పరిగెత్తడం ఎలా సాధ్యం..? ఈ జీవికి అతీత శక్తులు ఉన్నాయా..?
అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు