AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరహ వేదన.. రోడ్డుపై భగ్నప్రేమికుడి ప్రేమ రాతలు.. ఏకంగా 2.5 కిలోమీటర్లు.. ఏం రాశాడో మీరే చూడండి

ప్రేమ, ఇష్క్, కాదల్.. పేరు ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే. అవతలి వ్యక్తిపై అమితమైన ఇష్టం. వారితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఆరాటం.

విరహ వేదన.. రోడ్డుపై భగ్నప్రేమికుడి ప్రేమ రాతలు.. ఏకంగా 2.5 కిలోమీటర్లు.. ఏం రాశాడో మీరే చూడండి
Love Failure
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2021 | 7:18 PM

Share

ప్రేమ, ఇష్క్, కాదల్.. పేరు ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే. అవతలి వ్యక్తిపై అమితమైన ఇష్టం. వారితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఆరాటం. కానీ అన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతాయా అంటే కానే కాదు. కొన్ని మధ్యలోనే బ్రేేకప్ అవుతాయి. అందుకు సవాలక్ష కారణాలు ఉంటాయి. టైమ్ పాస్ ప్రేమలు అయితే లైట్ కానీ.. సిన్సియర్‌గా ప్రేమించినవారు.. తన ప్రేయసి లేదా ప్రియుడ్ని వదిలేసి దూరంగా ఉండటం ఓ యుద్దమే. అప్పటివరకు పెట్టుకున్న ఆశలు పేకమేడలా కూలిపోతాయి. దీంతో కొందరు వైరాగ్యంలోకి వెళతారు. మరికొందరు ప్రేమించిన వ్యక్తిని విడిచిఉండటం ఇష్టం లేక.. బలవన్మరణాలకు పాల్పడతారు. కానీ అది చాలా పిచ్చిపని. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న స్నేహితులు.. బోలెడంత భవిష్యత్ ఇవన్నీ వదిలేసి జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం మూర్ఖత్వమే అవుతుంది.

కాగా తాజాగా మహారాష్ట్రలో ప్రేమ విఫలమైన వ్యక్తి తన విరహా వేధనను వినూత్నమైన రితీలో ప్రదర్శించాడు. భాగస్వామిపై తన అభిమానాన్ని చూపించడానికి రోడ్డుపై 2.5 కిలోమీటర్ల దూరం ‘ఐ లవ్ యు’,  ‘ఐ మిస్ యు’ అని రాసుకుంటూ వెళ్లాడు. కొల్లాపూర్ జిల్లా శిరోల్ తహసీల్‌కు చెందిన ధారంగుట్టి గ్రామస్థులు ఈ ప్రేమ రాతలను తొలుత చూశారు. జైసింగ్‌పూర్ నుంచి ధారంగుట్టి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి ఈ  రాతలు రాసినట్లు వారు గుర్తించారు. అయితే తన రాతలకు ప్రారంభంలో మాత్రం.. ‘నేను బ్రతుకున్నతం కాలమే కాదు… చనిపోయాక కూడా నిన్ను మిస్ అవుతాను’ అని అతను రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. పోలీసులు రోడ్డుపై ఈ ప్రేమ రాతలు వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు.

Also Read: విచిత్రం.. నీటిలో మునగకుండా పరిగెత్తడం ఎలా సాధ్యం..? ఈ జీవికి అతీత శక్తులు ఉన్నాయా..?

కోళ్ల పారం నుంచి పిల్లి అరుపులు.. భయంతో పరిగెత్తుకెళ్లిన ఫౌల్ట్రీ రైతు.. షాకింగ్ సీన్