Viral Video: విచిత్రం.. నీటిలో మునగకుండా చెరువులో పరిగెత్తడం ఎలా సాధ్యం..? ఈ జీవికి అతీత శక్తులు ఉన్నాయా..?
ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొంత ప్రత్యేక శక్తి ఉంటుంది. కానీ కొందరు వాటిని గుర్తుస్తారు.. మరికొందరు గుర్తించలేరు.
ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొంత ప్రత్యేక శక్తి ఉంటుంది. కానీ కొందరు వాటిని గుర్తుస్తారు.. మరికొందరు గుర్తించలేరు. మానవులకు మాత్రమే కాకుండా జంతువులకు, పక్షులకు కూడా కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నాం. అది చూడగానే మీరు షాక్‌కు గురవ్వడం ఖాయం. మీ కళ్లే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాయా అనే డౌట్ కూడా రాకమానదు. మీరు చాలా జంతువులను చూసి ఉంటారు. వాటిలో కొన్నింటికి స్పెషల్‌గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల.. అవి డిఫరెంట్ టాస్కులు చేస్తాయి. సర్కస్ లేదా జూలలో మీరు కాస్త విభిన్నంగా ప్రవర్తించే జంతువులను చూసి ఉంటారు. అయితే నీటిపై నడిచే, పరిగిత్తే జంతువును ఎప్పుడైనా చూశారా..?. లేదు కదా.. అయితే ముందుగా ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి.
— African animals (@AfricanimaIs) March 26, 2021
చూశారా.. ఆ జంతువు నీటిలో మునిగిపోకుండా చెరువులో ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుందో. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అసలు ఇది ఎలా సాధ్యమనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. వీడియో చూడగానే మొదట షాక్‌గా గురవ్వడం.. తర్వాత ‘హౌ ఈజ్ ఇట్ పాజిబుల్’ అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వడం చాలా కామన్. కాగా పడవలో ప్రయాణించే ఒక వ్యక్తి దాన్ని చిత్రీకరించినట్లు వీడియోని బట్టి అర్థమవుతుంది. ఈ ఆశ్చర్యకరమైన వీడియో ‘ఆఫ్రికన్ యానిమల్స్’ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వార్తను వ్రాసే సమయం వరకు సదరు వీడియోకు 9.5 వేలకు పైగా వ్యూస్ ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలామంది యూజర్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఒక యూజర్ ‘ఇదంతా ఫేక్, కెమెరా ట్రిక్’ అని పేర్కొనగా… అదే సమయంలో, మరొకరు ‘ఈ సంవత్సరం నేను చూసిన వింత ఇదే’నంటూ రాసుకొచ్చాడు.
Also Read: అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు
పెళ్లి అనంతరం అప్పగింతల్లో ఇలాంటి సీన్ మీరు చూసి ఉండరు.. క్రేజీ నవవధువు