- Telugu News Photo Gallery Viral photos Bride drives car with husband to her mother in law house after wedding goes viral
Viral News: పెళ్లి అనంతరం అప్పగింతల్లో ఇలాంటి సీన్ మీరు చూసి ఉండరు.. క్రేజీ నవవధువు
కోల్‌కతాకు చెందిన స్నేహా సింగీకి ఇటీవల సౌగత్ ఉపాద్యాయ్‌తో వివాహం అయ్యింది. పెళ్లి అనంతరం అప్పగింతల్లో భాగంగా.. తల్లిదండ్రులు ఆమెను అత్తింటికి పంపడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో, అన్ని చోట్లా వధువులు చేసే విధంగా ఆమె విచారంలో మునిగిపోలేదు.
Updated on: Mar 27, 2021 | 10:38 PM

కోల్‌కతాకు చెందిన బిజినెస్ విమెన్ స్నేహా సింగీని ఇటీవల సౌగత్ ఉపాద్యాయ్ అనే వ్యక్తికి ఇచ్చి గ్రాండ్‌గా పెళ్లి చేశారు పెద్దల. అప్పగింతల్లో భాగంగా.. తల్లిదండ్రులు ఆమెను అత్తింటికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

అయితే, ఈ తంతులో భాగంగా రొటీన్‌గా ఆమె బాధతో కారు వెనుక సీటులో కూర్చోలేదు. వరుడిని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తానే కారు డ్రైవింగ్ చేసింది. పెళ్లిబట్టలతో కారును నడుపుతూ అత్తింట్లో అడుగు పెట్టేందుకు బయల్దేరింది. ఆమె ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

స్నేహాకు కోల్‌కతాలో చాలా కేఫ్ సెంటర్లు ఉన్నాయి. మహిళా వాణిజ్యవేత్తగా నగరంలో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఆమె మరింత ఫేమస్ అయ్యింది.

భావోద్వేగాన్ని మనసులోనే ఉంచుకుని అందరికీ బై..బై.. చెబుతూ కారును ముందుకు పోనిచ్చిన ఆమె తీరును చూసి.. ఆమె చాలా స్ట్రాంగ్ విమెన్ అని కామెంట్లు పెడుతున్నారు పలువురు.

ఆమె మొదలుపెట్టిన ఈ కొత్త ట్రెండ్‌ను ఇంకెంతమంది ఫాలో అవుతారో అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.




