Glass Bridge: చైనాలో మరో అద్భుత కట్టడం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
చైనా ఏది చేసినా.. చైనాలో ఏం జరిగినా.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వాల్సిందే. అలాంటి టాపిక్ ఇప్పుడొకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Glass Bridge: చైనా ఏది చేసినా.. చైనాలో ఏం జరిగినా.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వాల్సిందే. అలాంటి టాపిక్ ఇప్పుడొకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైనాలో ఇప్పటికే ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. తాజాగా అక్కడి మరో కట్టడం ప్రపంచ దేశాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో నిర్మించిన ‘రూయి’ అనే వంతెన ప్రజలను అబ్బురపరుస్తోంది. దానిని చూసిన ప్రజలు ఇది నిజమేనా అని షాక్ అవుతున్నారు. కారణం ఆ వంతెన వింతగా ఉండటమే. భూమి ఉపరితలానికి 140 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ గాజు వెంతెనను డీఎన్ఏ కణం ఆకారంలో నిర్మించారు. దీనిని అక్కడి ప్రజలు ‘బెండింగ్’ వంతెన అని పిలుస్తుంటారు.
దీనిని చూసి ప్రజలు సంబ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. వంతెన రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలుసుకుని, విడిపోయి, మెలికలు తిరిగినట్లుగా ఉంటుంది. 2017లో ఈ వంతెన నిర్మాణం చేపట్టగా.. 2020లో ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జి ఓపెన్ చేసింది మొదలు.. పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. ఆ బెండింగ్ గాజు వంతెనను చూసి మురిసిపోతున్నారు. ఆ గాజు వంతెనపై నడవటడం అద్భుతమైన ఫీలింగ్‌ను ఇస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. కాగా, 100 మీటర్ల పొడవైన ఈ గాజు వంతెనను 140 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో షెంజియాంజు సరిహద్దుల్లో నిర్మించారు.
కాగా, ఈ వంతెనకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వంతెనను చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఎలా నిర్మించారబ్బా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది కంప్యూటర్ ఇమేజ్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. అసలు అలా ఎలా నిర్మిస్తారంటూ మరికొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2020 నవంబర్ నెలలో కెనడియన్ వ్యోమగామి క్రిస్ హాడ్ఫీల్డ్ ‘రూయి’ వంతెనకు సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వంతెన నిజమే అని అందరూ నిర్ధారించుకున్నారు.
Also read: