5 Step Plan to Curb Covid-19: కరోనా కట్టడికి ఐదు సూత్రాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు..

5 Step Plan to Curb Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ...

5 Step Plan to Curb Covid-19: కరోనా కట్టడికి ఐదు సూత్రాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు..
Corona Virus
Follow us

|

Updated on: Mar 28, 2021 | 12:35 AM

5 Step Plan to Curb Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 5 దశల ప్రణాళికలను ప్రకటించింది. ముఖ్యంగా కరోనాను అరికట్టాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయడం ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తోంది. 70 శాతానికి పైగా టెస్ట్‌లను ఆర్టీ పీసీఆర్ ద్వారా నిర్వహించాలని వైద్యాధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐదు దశల ప్రణాళికలలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల నిర్వహణ కూడా ఒక అంశం.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీతో సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెరుగుతున్న కరోనావైరస్ (కోవిడ్ -19) కేసులను తగ్గించడానికి కేంద్రం ఐదు అంశాల ప్రణాళికను శనివారం తీసుకువచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా ప్రభావితమైన 46 జిల్లాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, 12 రాష్ట్రాల కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, పంజాబ్, బీహార్ ప్రతినిధులు హాజరైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్ కూడా హాజరయ్యారు.

మే 2020 నుండి భారతదేశం వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ వస్తోంది. మధ్యలో కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా.. రెండో వేవ్ మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఇక కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా దేశంలో విపరీతంగా పెరిగింది. దేశంలోని 46 జిల్లాలలో 71 శాతం కేసులు నమోదు అవగా.. ఈ ఒక్క నెలలోనే 69 శాతం మరణాలు సంభవించాయి. “మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో 25 ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా 59.8 శాతం కేసులు నమోదవగా అందులో 25 శాతంపైగా కేసులు మహారాష్ట్రలోని 36 జిల్లాల్లోనే నమోదు కావడం విశేషం.

కరోనా కట్టడికి కేంద్రం సిద్ధం చేసిన ఐదు ప్రణాళికలు ఇవే..: 1. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలి. ఆర్టీ పీసీఆర్ పరీక్షలలో అధిక వాటాతో ఎక్స్‌పోనెన్షియల్ రేటుతో పరీక్షను పెంచడం ఈ వ్యూహంలో ఉంది – మొత్తం పరీక్షలో 70 శాతానికి పైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలే నిర్వహించాలి. ఇక “రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రాంతాల నుండి క్లస్టర్ కేసులను బయటకు తీయడంలో స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగించబడుతుంది” అని కేంద్రం పేర్కొంది. 2. కరోనా సోకిన వారు కఠినమైన ఐసోలేషన్‌లో ఉండటంతో పాటు.. మరెవరితోనూ సదరు వ్యక్తి కనీసం మాట్లాడొద్దు. కాగా, కరోనా బారిన పడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంకా.. కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారో 72 గంటల్లోగా గుర్తించి, వారికి కూడా పరీక్షించి వేరుచేయాల్సిన అవసరం ఉందన్నారు. 3. ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షకుల సేవలను తిరిగి ఉపయోగించుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులను అన్ని విధాలుగా సహకరించాలంది. ఇక మరణాల రేటు, మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంగా విధానాలను అమలు చేయలంది. 4. అన్ని సమయాల్లో, ముఖ్యంగా మార్కెట్లు, ఇంటర్-స్టేట్ బస్ స్టాండ్లు, పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాలలో కోవిడ్ -19 సోకిన వారిని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. దీని కోసం ప్రజల్లో అవగాహనాల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కరోనా నిబంధనలు పాటించడంలో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భారీ జరిమానాలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. 5. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అవసరమని కేంద్రం పేర్కొంది. టార్గెట్‌ను పెట్టుకున్నా.. ఆ టార్గెట్ ప్రకారం వ్యాక్సినేషన్‌ను చేపట్టాలంది. ఇక అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న జిల్లాల్లో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంది. నిర్ణీత వయస్సు గల వారికి టీకాలు పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Also read:

Boat Blocks Highway: ఏమైందీ పడవలకు!.. ఓ నౌక సూయజ్‌ కాలువను బ్లాక్ చేస్తే.. మరో పడవ ఫ్లోరిడా హైవే ని బ్లాక్ చేసింది..

Myanmar Violence: మయన్మార్‌ దారుణం.. రెచ్చిపోయిన భద్రతా బలగాల కాల్పులు.. 90 మందికిపైగా మృతి..