AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myanmar Violence: మయన్మార్‌లో‌ దారుణం.. రెచ్చిపోయిన భద్రతా బలగాల కాల్పులు.. 90 మందికిపైగా మృతి..

Myanmar Violence: మయన్మార్‌లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త...

Myanmar Violence: మయన్మార్‌లో‌ దారుణం.. రెచ్చిపోయిన భద్రతా బలగాల కాల్పులు.. 90 మందికిపైగా మృతి..
Myanmar Violence
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2021 | 12:36 AM

Share

Myanmar Violence: మయన్మార్‌లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధ బలగాలు రెచ్చిపోయి ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబెడ్డాయి. ఈ కాల్పు్ల్లో దాదాపు 90 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోయిన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నారు. మయన్మార్‌లోని మాండలేలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 29 మంది చెందారని, యాంగోన్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో దాదాపు 24 మంది చనిపోయారని, అలాగే సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారని మయన్మార్ మీడియా వెల్లడించింది. సైనిక తిరుబాటును వ్యతిరేకిస్తూ యమన్మార్ దేశ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ప్రజలు ఆందోళనలు చేయడం, సాయుధ బలగాలు వారిపై దాడి చేసి అణచివేయడం జరుగుతూనే ఉంది.

అయితే ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ ప్రభుత్వాన్ని కాదని ఆదేశ సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆదేశ ప్రజలు నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోయిన అక్కడి పోలీసు అధికారులు.. ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సైన్యం దాడిలో రెండు నెలల్లో చనిపోయిన వారి కంటే ఇవాళ చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ అని అక్కడి మీడియా వర్గాల సమాచారం. ఇక సైన్యం తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి మయన్మార్‌ వ్యాప్తంగా 300 మందికి పైగా ప్రజలు మరణించినట్లు సమాచారం.

ఇదిలాఉంటే.. మయన్మార్ సాయుధ దళాల దినోత్సవం రోజు(మార్చి 27)నే ఆదేశ సైన్యం ఇంతటి ఘాతుకానికి పాల్పడటంపై యావత్ ప్రపంచం నిప్పులు చెరుగుతోంది. భద్రతా దళాలు తమను తాము అవమానించుకున్నాయని బ్రిటిష్ రాయబారి డాన్ చుగ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ దుశ్చర్యను యునైటెడ్ స్టేట్స్ రాయబారి.. భయంకరమైన హింసగా అభివర్ణించారు. ‘ఈ రోజు సాయుధ దళాలు సిగ్గుపడే రోజు’ అని సీఆర్‌పీహెచ్ ప్రతినిథి డాక్టర్ సాసా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:

Samsung Galaxy F02S: అతి తక్కువ లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ ధర అంత అంటే…!! ( వీడియో )

Chandrababu letter to CM Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ