కుప్పలు తెప్పలుగా ఎలుకలు.. ఎక్కడ చూసినా అవే.. తాగునీటి ట్యాంక్‌లలో కూడా.. ప్రజల్లో ఆందోళన
ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద విపరీతంగా పెరిగింది. ఇళ్ళు పొలాలు షాపుల్లో గుంపులుగా భయపెడుతున్నాయి. ఇటీవల న్యూసౌత్‌వేల్స్‌ను కుండపోత వర్షాలు..
ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద విపరీతంగా పెరిగింది. ఇళ్ళు పొలాలు షాపుల్లో గుంపులుగా భయపెడుతున్నాయి. ఇటీవల న్యూసౌత్‌వేల్స్‌ను కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తాయి. తర్వాత ఎక్కడ్నుంచి వచ్చాయో కానీ ఎలుకలు, సాలీళ్లు వందలకొద్దీ దాడి చేస్తున్నాయి. దీంతో రెస్టారెంట్లు, షాపుల యజమానులు తమ బిజినెస్‌లు క్లోజ్ చేసి ఎలుకలను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక ఆస్ట్రేలియాలోని తూర్పు రాష్ట్రాలలో కొన్ని మిలియన్ల ఎలుకలు రోడ్ల మీద వెళ్ళడం చూసి అక్కడ నివసించే వారు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు తమ భూమిని, పంటను ధ్వసం చేస్తున్న ఎలుకలను, ఇళ్లలో నివాసం ఉంటున్న ఎలుకల వీడియో లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూ సౌత్ వేల్స్ ఆసుపత్రులలో కనీసం ముగ్గురు వ్యక్తులను ఎలుకలు గాయపరిచాయి.
పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్ధాలను తినేస్తున్నాయి. మరికొన్ని ట్యాంక్‌లలో చేరి తాగునీటిని కలుషితం చేస్తున్నాయి.. దీంతో అధికారులతో పాటు.. ప్రజలు కూడా తమ పనులను పక్కన పెట్టి.. ఎలుకలను పట్టుకునే పనిలో పడ్డారు. ఎలుకల వల్ల ప్లేగు వ్యాపిస్తుందేమో అని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిడ్నీ వంటి ప్రాంతాల్లో ఎలుకలతో పాటు ప్రమాదకరమైన ఫన్నెల్ వెబ్ సాలీళ్లు ఇళ్లల్లో ప్రవేశిస్తున్నాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి సిడ్నీ వాసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: 13 ఏళ్ల వయస్సులోనే గర్భవతి అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం.. ఇప్పుడు ఆమె సంపాదన షాకింగ్..
పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు