13 ఏళ్ల వయస్సులోనే గర్భవతి అయ్యి… ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం.. ఇప్పుడు ఆమె సంపాదన షాకింగ్..
ప్రపంచంలో కొన్ని, కొన్ని సంఘటనల గురించి వింటే మనం షాక్‌కు గురవుతాం. గత సంవత్సరం రష్యాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ నివశించే 13 ఏళ్ల అమ్మాయి పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రపంచంలో కొన్ని, కొన్ని సంఘటనల గురించి వింటే మనం షాక్‌కు గురవుతాం. గత సంవత్సరం రష్యాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ నివశించే 13 ఏళ్ల అమ్మాయి పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన గురించి మొదటిసారి వింటుంటే మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇది పూర్తి నిజం. దర్యా సుడ్నిష్నికోవా అనే అమ్మాయి 13 సంవత్సరాల వయసులో గర్భవతి అయ్యింది. అంతేకాదు కేవంల 10 ఏళ్ల వయసున్న తన ప్రియుడు ఇవాన్ అందుకు కారణంగా పేర్కొంది. అయితే, చాలా మంది నిపుణులు ఆమె వాదనను తిరస్కరించారు. మీడియా నివేదికల ప్రకారం, ఆ అమ్మాయికి ఆ 10 సంవత్సరాల బాలుడితో ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఆమె వేరొకరి ద్వారా గర్భవతి అయినట్లు తేల్చారు.
View this post on Instagram
ఈ విషయం తెరపైకి రాగానే దర్యా సుడ్నిష్నికోవా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం, ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి కూడా. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఆమెకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దర్యా సామాజిక మాధ్యమాల ద్వారా చాలా ప్రాచూర్యాన్ని పొందింది. ఒక నెలలో ఆమె ఐదు వేల పౌండ్లు, అంటే ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఆమె తల్లిదండ్రుల సంపాదన మొత్తం కలిపినా కూడా దర్యా సంపాదనతో సమానం కాదట. గర్భవతి అయినందున దర్యా స్కూల్‌కు వెళ్లకుండా ఒక సంవత్సరం విరామం తీసుకున్నారు. అయితే, తొలుత ప్రగ్నెంట్ అయినప్పుడు తన స్కూల్‌లోని ఉపాధ్యాయులపై కూడా దర్యా ఆరోపణలు చేసింది. దీంతో పాఠశాలకు తిరిగి వెళ్తోన్న క్రమంలో, కోపంతో ఆమెకు ఉపాధ్యాయులు తక్కువ గ్రేడ్లను ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
View this post on Instagram
దర్యా తల్లి ఎలెనా తన కుమార్తె పరిస్థితిని తొలుత గమనించినప్పుడు, ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని భావించింది. కాని వైద్య పరీక్షల తరువాత, అసలు విషయం రివీల్ అయ్యింది. అయితే మీడియా దర్యా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆమెను ఒక సెలబ్రిటీని చేసేసింది. అంతే కాదు, పలు లైవ్ షోలలో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. ప్రసిద్ధ కంపెనీ స్పాన్సర్లకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వేస్తూ.. ఆమె ఆదాయాన్ని సంపాదిస్తుంది.