కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదు.. అధికారుల సమావేశంలో సీఎం

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా,తాజాగా మళ్లీ పాజిటివ్‌ కేసుల...

కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించక తప్పదు.. అధికారుల సమావేశంలో సీఎం
Cm Instructed
Follow us
Subhash Goud

|

Updated on: Mar 28, 2021 | 8:56 PM

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా,తాజాగా మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఇక మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని, ప్రజల నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయిన ముఖ్యమంతరి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్యం వీడకపోతే ప్రమాదం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాగే నిర్లక్ష్యం చేసినట్లయితే లాక్‌డౌన్‌ లాంటి కఠినమైన ఆంక్షలు విధించక తప్పదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులపై ఆదివారం సీనియర్‌ వైద్యాధికారులు, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌తో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశించారు. అయితే జనాలు కోవిడ్‌ నిబంధనలు పాటించనట్లయితే లాక్‌డౌన్‌ లాంటి కఠినమైన నిబంధనలు అవసరమని, అందరు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

కాగా, దేశ వ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా పాజిటివ్‌ కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఇక ఈ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా పలు రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇక తాజాగా తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏప్రిల్‌ 10వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. పండగలపై ఆంక్షలు విధించింది. ర్యాలీలు, యాత్రలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోళీ, శ్రీరామనవమి వేడుకల్లో జనాలు గుమిగూడవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు మాస్క్‌ లేకుండా బయట తిరగవద్దని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇవీ చదవండి:  73 ఏళ్ల వయసులో ‘వరుడు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చిన బామ్మ.. ఒంటరిగా ఉండలేకపోతున్నానంటున్న వద్ధురాలు

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి

9, 10 తరగతుల్లో హిందీ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయోచ్..: విద్యాశాఖ
9, 10 తరగతుల్లో హిందీ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయోచ్..: విద్యాశాఖ
పతి పత్ని ఔర్ వో..! ప్రియుడితో గుట్టుగా భర్తను లేపేద్దామనుకుంది..
పతి పత్ని ఔర్ వో..! ప్రియుడితో గుట్టుగా భర్తను లేపేద్దామనుకుంది..
టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..
టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా ఖతర్నాక్ ప్లేయర్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా ఖతర్నాక్ ప్లేయర్
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..