Surabhi Vanidevi: ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్ చేశారంటే..?
Covid-19 positive: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు
Covid-19 positive: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్సీకి కరోనా సోకింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వాణీదేవి కోరారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినందున.. తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ ఉండాలని.. అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి వాణీదేవి కోరారు. ఇటీవల ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై గెలుపొందారు.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Surabhi Vani Devi (@SurabhiVaniDevi) March 28, 2021
Also Read: