AP Coronavirus Cases : అయ్యో..! మరోసారి విరుచుకుపడుతోందే..! ఏపీలో వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లోకొత్తగా 1,005 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో...
AP Coronavirus Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లోకొత్తగా 1,005 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,95,920కి చేరింది. ఇందులో5,394 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,83,32 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు కోవిడ్-19తో 7,205 మంది మరణించారు. ఇక నిన్న324 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,49,90,039 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం36, చిత్తూరు 184, తూర్పుగోదావరి 25, గుంటూరు 225, కడప 21, కృష్ణా 135, కర్నూలు 42, నెల్లూరు 84, ప్రకాశం 35, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 167, విజయనగరం 13, పశ్చిమ గోదావరి 16 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 28/03/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,95,920 పాజిటివ్ కేసు లకు గాను *8,83,321 మంది డిశ్చార్జ్ కాగా *7,205 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,394#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kUgfjCqs1t
— ArogyaAndhra (@ArogyaAndhra) March 28, 2021
ఇవి కూడా చదవండి :
IND vs ENG 3rd ODI : Karnataka CD row: కర్నాటకలో రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తు రూట్ మార్చుతున్నారంటున్న సీడీ లేడీ.. SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక… హోలీ సంద్భంగా ఇలాంటి మోసాలకు ఛాన్స్..