Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: రాత్రి సమయంలో కర్ఫ్యూ.. కనిపిస్తే తాట తీస్తారు.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

మళ్లీ కరోనా వైరస్ దండయాత్ర మొదలుపెట్టింది. మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల సంఖ్య వణుకు పుట్టిస్తోంది.  

Breaking News: రాత్రి సమయంలో కర్ఫ్యూ.. కనిపిస్తే తాట తీస్తారు.. ఎప్పటి నుంచి అమలు అంటే..!
Night Curfew
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 26, 2021 | 8:39 PM

Night Curfew Will Be Imposed: కరోనా పీడ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశాన్ని వదిలిపోయింది అనుకున్న సమయంలోనే మరోసారి విజృంభించడంతో దేశ వ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. పోయిన ఏడాది ఇదే నెలలో జనాన్ని వణికించిన వైరస్ రూపం మార్చుకొని దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి విరుచుకుపడుతోంది. అయితే కోవిడ్ రక్కసి విరుచుకు పడుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.

రాత్రి కర్ఫ్యూ..

మహారాష్ట్రలో కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోంది. ఈ ప్రమాదాన్ని చూసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే  కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర వస్తువుల దుకాణాలతో పాటు, ఫంక్షన్ హాల్స్ , దొంబివాలిలోని అన్ని దుకాణాలు ప్రతి శనివారం, ఆదివారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం సీఎం  ఈ నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కూడా హాజరయ్యారు. ఈ సమావేశం 2 గంటలు కొనసాగింది.

కరోనాను నియంత్రించిన తరువాత, టీకాను మరింత పెంచడం ఎలా? వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే ప్రణాళికతో సహా వైద్య సిబ్బంది సంఖ్యను కూడా చర్చించారు. 

లాక్డౌన్ పెట్టడం ఇష్టం లేదు-సీఎం

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ .. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య సేవలకు కొరత రాకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. దీనితో పాటు అధికారులందరికీ ఎప్పటికప్పుడు ఆరోగ్య సేవలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.

ఇవి కూడా చదవండి : IND vs ENG 2nd ODI Live: టీమిండియా ఆటగాళ్ల దూకుడు.. భారత్ భారీ స్కోర్… ఇంగ్లాండ్ టార్గెట్ 337..

IPL 2021: ఈ నలుగురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కదట.. వారెవరంటే?