GHMC : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులకు ముఖ్య గమనిక, పాక్షిక ఆంక్షలు అమల్లోకి
GHMC : రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పలు ఆంక్షలు విధించింది. ప్రధాన ..
GHMC : రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పలు ఆంక్షలు విధించింది. ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై పాక్షిక ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల సందర్శనపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి. తమ ఆరోగ్య భద్రత దృష్ట్యా కార్యాలయానికి రావద్దని జీహెచ్ఎంసీ ప్రజల్ని కోరింది. ఏదైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉండే మై-జీహెచ్ఎంసీ యాప్, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం దగ్గరున్న గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తులు అందచేయాలని సూచిస్తోంది. కాగా, ఇప్పటికే జీహెచ్ఎంసీ లోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా ఈ పాక్షిక ఆంక్షలు విధిస్తున్నామని జీహెచ్ఎంసీ పేర్కొంది.