AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Shakeela Political Entry : సంచలన సినీ నటి షకీల పొలిటికల్ అరంగేట్రం, ఇక తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక

Actress Shakeela Political Entry : తెలుగు సీనీ ప్రేక్షకులకు సుపరిచితురాలు నటి షకీలా పొలిటికల్ అరంగేట్రం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె..

Actress Shakeela Political Entry : సంచలన సినీ నటి షకీల పొలిటికల్ అరంగేట్రం, ఇక తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక
Shakeela Joins Congress In
Venkata Narayana
|

Updated on: Mar 26, 2021 | 7:08 PM

Share

Actress Shakeela Political Entry : తెలుగు సీనీ ప్రేక్షకులకు సుపరిచితురాలు నటి షకీలా పొలిటికల్ అరంగేట్రం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనబోతున్నారు. అంతేకాదు, ఇక మీదట కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ వింగ్ లో ఆమె కీలక భూమిక కూడా నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారంతోపాటు, ప్రజలకు సేవ చేయాలనే ఉదేశ్యం తోనే తాను రాజకీయాలలోకి వస్తున్నానని షకీల అన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఉండాలి.. ‘కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉండడం ద్వారా నా లక్ష్యం నెరవేరుతుంది’. అని ఆమె పార్టీలో జాయిన్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

కాగా, నటి షకీలా 90 వ దశకంలో పలు సినిమాల్లో విలక్షణ మైన పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు. అనేక మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నారు. ఇటీవల, అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో కుక్ విత్ కోమలిలో పాల్గొనడంతో ఆమె ఇమేజ్ కు మేక్ఓవర్ వచ్చింది. కోమాలి సీజన్ 2 తో కుక్‌లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలాకు భారీ సంఖ్యలో మరింత మంది అభిమానుల మద్ధతు లభించింది. ఎలిమినేషన్ తర్వాత ఆమె ఈ వారం వైల్డ్-కార్డ్ పోటీదారుగా కూడా వస్తున్నారు.

ఇలా ఉండగా, కొంతకాలంగా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెబుతున్న షకీలా.. ఇప్పుడు అధికారికంగా రాజకీయ పార్టీలో చేరి తన మాటల్ని నిజం చేసుకున్నారు. షకీలా కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల విభాగంలో చేరడం ద్వారా పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆమె పార్టీలో చేరి సభ్యత్వ కార్డు తీసుకుంటున్న ఫొటోలు తమిళనాట వైరల్ అవుతున్నాయి. మరోవైపు, షకీల తమ పార్టీలోకి రావడాన్ని తమిళనాడు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తమ సంతోషాన్ని వెలిబుచ్చుతూ స్వాగతిస్తున్నారు.

Read also : Sagar By Election : సాగర్ పోరులో నేనే బీజేపీ అభ్యర్థిని, మంచిరోజు కాబట్టే నామినేషన్ వేశా, నివేదిత సెల్ఫ్ అనన్సౌమెంట్